సాధారణంగా కొందరి జుట్టు చాలా పల్చగా ఉంటుంది.హెయిర్ గ్రోత్ ( Hair growth )అనేది అస్సలు ఉండదు.
ఈ క్రమంలోనే జుట్టు ఒత్తుగా పెంచుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.రకరకాల కేశ ఉత్పత్తులను వాడుతుంటారు.
అయితే అలాంటి వారికి క్యారెట్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.నిత్యం ఒక క్యారెట్ ను తినడంతో పాటు వారానికి ఒకసారి ఇప్పుడు చెప్పబోయే క్యారెట్ హెయిర్ మాస్క్ ను కనుక వేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ జుట్టు డబుల్ అవుతుంది.
అందుకోసం ముందుగా ఒక చిన్న క్యారెట్ ( carrot )తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను ఆవిరిపై ఉడికించి మిక్సీ జార్ లో స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ క్యారెట్ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Yogurt ), వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒకసారి ఈ క్యారెట్ మాస్క్ వేసుకోవడం వల్ల చాలా లాభాలు పొందుతారు.క్యారెట్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా-కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి కురుల ఆరోగ్యానికి అవసరమయ్యే పోషణ అందిస్తాయి.
విటమిన్ ఇ తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, కుదుళ్లను బలోపేతం చేస్తుంది.బీటా-కెరోటిన్ జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.
విటమిన్ ఎ స్కాల్ప్‌కు తేమను అందిస్తుంది.జుట్టు తంతువులను ఆరోగ్యంగా మారుస్తుంది.

పైన చెప్పుకున్న క్యారెట్ హెయిర్ మాస్క్ ను వారానికి ఒకసారి వేసుకుంటే కొన్ని నెలల్లోనే మీ జుట్టు డబుల్ అవుతుంది.అదే సమయంలో మృదువైన మెరిసే జుట్టు మీ సొంతం ఉంటుంది.ఈ క్యారెట్ మాస్క్ జుట్టును హైడ్రేట్ చేయడానికి, పొడి మరియు విచ్ఛిన్నతను నిరోధించడానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.







