మొలకెత్తిన విత్తనాలు వీటినే ఇంగ్లీషులో స్ప్రౌట్స్ అంటాము.ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఆహారాల్లో స్ప్రౌట్స్( Sprouts ) ముందు వరుసలో ఉంటాయి.
అయితే స్ప్రౌట్స్ అనగానే ఎక్కువ శాతం మంది పెసలను మాత్రమే ఉపయోగిస్తారు.కానీ మొలకెత్తిన వేరుశనగలు ( Peanuts )కూడా ఆరోగ్యానికి ఎన్నో లాభాలను అందిస్తాయి.
మామూలు వేరుశనగలతో పోలిస్తే మొలకెత్తిన వేరుశనగల్లో పోషకాలు అధికంగా ఉంటాయి.మొలకెత్తిన వేరుశనగలను తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మొలకెత్తిన వేరుశనగల్లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది.ఇది జీర్ణక్రియ, గట్ ( Digestion, gut )ఆరోగ్యానికి తోడ్పడుతుంది.బరువు నిర్వహణలో సహాయపడుతుంది.బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి మొలకెత్తిన వేరుశనగలు మంచి ఆహార ఎంపిక అవుతుంది.
ఇవి అతిగా తినడానికి అడ్డుకట్ట వేస్తాయి.అలాగే మొలకెత్తిన వేరశనగల్లో మోనోశాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.
ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

మొలకెత్తిన వేరుశనగలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి.అందువల్ల మధుమేహం ఉన్న వారు కూడా వీటిని తినొచ్చు.మొలకెత్తిన వేరుశనగలు మధుమేహులను నీరసం, అలసట బారిన పడకుండా రక్షిస్తాయి.మొలకెత్తిన వేరశనగల్లో మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ ఇ, కాపర్, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించి మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

మామూలు వేరుశనగలతో పోలిస్తే మొలకెత్తిన వాటిలో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది.ప్రోటీన్ కొరతతో బాధపడేవారు రెగ్యులర్ డైట్ లో మొలకెత్తిన వేరుశనగలను చేర్చుకోవడం ఎంతో ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.అంతేకాదు, మొలకెత్తిన వేరుశనగలను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.మరియు వివిధ శారీరక విధులకు అవసరమైన ముఖ్యమైన ఖనిజాలను మొలకెత్తిన వేరుశనగల ద్వారా సులభంగా పొందొచ్చు.







