ముదురు పింక్ రంగులో ఉండే కందగడ్డను చాలా మంది ఇష్టపడరు.అయితే అవి అందించే లాభాలను తెలుసుకుంటే తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకుంటారు.
మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఈ కందగడ్డలో ఉన్నాయి.కొన్ని ప్రాంతాల్లో కందగడ్డను చిలకడదుంప అని కూడా పిలుస్తారు.
అయితే చాలా మంది కందగడ్డ తింటే బరువు పెరుగుతామని అనుకుంటారు.కానీ మితంగా తింటే బరువు పెరిగే అవకాశం లేదు.
ఇప్పుడు కందగడ్డ తినటం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.కంద గడ్డలో బీటా కెరోటీన్ సమృద్ధిగా ఉండుట వలన రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
అంతేకాక చర్మ సమస్యలను తగ్గిస్తుంది.సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల నుండి చర్మానికి రక్షణ ఇస్తుంది.
కందగడ్డలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండుట వలన గర్భవతిగా ఉన్న మహిళలకు చాలా మేలును చేస్తుంది.గర్భధారణ సమయంలో పిండం ఎదుగుదలకు బాగా సహాయపడుతుంది.కందగడ్డలలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన నొప్పులు,వాపులను తగ్గించటమే కాకుండా శరీరంలో విష పదార్ధాలను బయటకు పంపుతాయి.మధుమేహం ఉన్నవారికి కందగడ్డలు దివ్యౌషధమే అని చెప్పాలి.
కందగడ్డలలో ఫైబర్స మృద్ధిగా ఉండుట వలన రక్తంలోని షుగర్ లెవల్స్‌ను ఒక్కసారిగా పెరగకూడా చూస్తుంది.అలాగే విటమిన్ సి, పొటాషియం ఉండడం వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.