తిరుమలలో అవినీతి రాజ్యమేలుతుంది అన్న ప్రధాన అర్చకులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు మన దేశ నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుని అభిషేకాలు, పూజలు చేస్తూ ఉంటారు.కానీ ఈ మధ్యకాలంలో చాలామంది ప్రధాన అర్చకులు తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి రాజ్యమేలుతుందని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

 Tirumala Chief Priest Ramana Dikshitulu Shocking Comments About Hereditary Pries-TeluguStop.com

తాజాగా తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యల పై చర్చ జరుగుతుంది.అయితే గతంలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఉన్నాయని కొంతమంది ప్రధాన అర్చకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వారు ఆలయ విధానాలతో పాటు అర్చక వ్యవస్థను నాశనం చేసే లోగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు.అయితే ఈ మేరకు సీఎం జగన్ ని ట్విట్ లో టాగ్ కూడా రమణ దీక్షితులు చేశారు.

అంతకు ముందు వంశపార్యపర్య అర్చకత్వానికి సంబంధించి ఏకాసభ్య కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రకటన చేస్తారని అర్చకులు రమణా దీక్షితులు భావిస్తున్నారు.ఈ విషయం పై ముఖ్యమంత్రి ప్రకటన చేయకపోవడం అర్చకులను తీవ్ర నిరాశపర్చిందని ప్రధాన అర్చకులు చెబుతున్నారు.

అంతేకాకుండా రమణా దీక్షితులు కొంతసేపటి తర్వాత ఆ ట్విట్ ను డిలీట్ కూడా చేశారు.

ఆయన ట్విట్టర్ అకౌంట్ లో కనిపించకపోయినా అప్పటికే కొందరు స్క్రీన్ షాట్ తీసుకోవడంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది.అయితే ఇది ఇలా ఉండగా తాజాగా రమణ దీక్షితులు మరోసారి ఘాటు విమర్శలు చేశారు.ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ శ్రీవారి ఆలయంలో వివిధ కులాలకు చెందిన 54 కుటుంబాలు వంశపార్యపరంగా సేవలు చేస్తున్నాయి.30/27 ఆక్ట్ తో వీరిని తొలగించారు.ప్రస్తుతం తిరుమల లో అవినీతి రాజ్యమేలుతుంది అంటూ రమణ దీక్షితులు ట్విట్ చేయడం ఆ ట్వీట్ కాస్త వైరల్ అవ్వడం కొన్ని క్షణాల్లో జరిగిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube