గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సోమనాథ ఆలయం ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటిగా పిలవబడుతోంది.ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనదని, ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పవచ్చు.
మహాశివుడికి ఎంతో ప్రత్యేకమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ జ్యోతిర్లింగం మొట్టమొదటిది.ఈ సోమనాథ ఆలయాన్ని “ప్రభాసతీర్థం” అని కూడా పిలుస్తారు.
మన దేశంలో ఉన్నటువంటి పన్నెండు జ్యోతిర్లింగాలలో సోమనాథ ఆలయం మొట్టమొదటిది.ఈ ఆలయంలో పరమేశ్వరుడు కొలువై ఉండి భక్తులను దర్శనం కల్పిస్తున్నారు.
మరి ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది.ఈ ఆలయంలోని ఒక స్థంభంపై బాణం ఉంది దీనిని బాణా స్తంభం అని కూడా పిలుస్తారు.మరి ఈ ఆలయంలో ఉన్న ఈ స్తంభం దేనిని సూచిస్తుంది? ఈ స్తంభం ప్రత్యేకత ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
పురాణాల ప్రకారం దక్షకుడి 27 మంది కూతుర్లు.27 మందినీ చంద్రదేవుడు వివాహం చేసుకున్నాడు.అయితే వీరందరిలో కెల్లా చంద్రుడు ఎక్కువగా రోహిణి మీదే అభిమానం పెంచుకొన్నాడు.దీంతో మిగిలిన వారందరూ ఇదే విషయాన్ని తమ తండ్రికి విన్నవించుకోగా దక్షకుడు చంద్ర దేవుని శపించాడు.
ఈ విధంగా చంద్రుడు శాపవిముక్తి కలగడం కోసం ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేశాడు.ఈ విధంగా చంద్రుడు శాప విముక్తి కలగటం వల్లనే ఈ ప్రాంతాన్ని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు.
ఈ క్రమంలోనే శివుడు చెప్పిన మాట ప్రకారం చంద్రుడు తన భార్యలను సమానంగా చూసుకోవటమే కాకుండా తాను ప్రతిష్టించిన లింగంలో కొలువై ఉంటానని మాట ఇచ్చాడు అందుకే ఇక్కడ వెలసిన స్వామివారిని సోమనాథుడు అని పిలుస్తారు.
ఈ విధంగా చంద్రుడు చేత ప్రతిష్ఠించబడిన ఈ శివలింగానికి ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి.అయితే సోమనాథ ఆలయాన్ని ఎన్నోసార్లు ధ్వంసం చేసి పునర్నిర్మించబడింది.ముఖ్యంగా ఈ ఆలయంలో ఒక స్థంభంపై బాణం ఉంటుంది.
అందుకే దీనిని బాణా స్తంభం అని పిలుస్తారు.ఈ బాణం సోమనాథ్ ఆలయం నుంచి దక్షిణ ధృవం వరకు ఉన్న సరళరేఖలో ఒక్క ఫ్లాట్ కూడా లేదని చూపిస్తుంది.
అంటే ఈ స్తంభం నిర్మాణ సమయంలోనే భారతీయులకు భూమి గుండ్రంగా ఉందని విషయం తెలుసని,అదే విధంగా భూమి దక్షిణ ధ్రువం అనే విషయాన్ని కూడా అప్పటికే భారతీయులకు తెలుసనే ఈ స్తంభం సూచిస్తుంది.ఈ స్తంభం క్రీస్తుశకం 600 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని అక్కడి శాసనాలు చెబుతున్నాయి.
GENERAL-TELUGU