ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమా రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.మరికొన్ని గంటల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
పుష్ప ది రైజ్ విడుదలైన మూడేళ్ల తర్వాత పుష్ప ది రూల్ మూవీ థియేటర్లలో రిలీజవుతోంది.ఈ సినిమా బన్నీ సుకుమార్ కాంబోలో నాలుగో సినిమా కావడం గమనార్హం.
ఈ కాంబినేషన్ లో ఇప్పటికే ఆర్య, ఆర్య2, పుష్ప ది రైజ్ సినిమలు వచ్చాయి.ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
పుష్ప ది రూల్ కోసం బన్నీ 300 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది.అత్యధిక రెమ్యునరేషన్( Highest Remuneration ) అందుకుంటున్న హీరోల జాబితాలో బన్నీ తొలి స్థానంలో నిలిచారు.
గత నెలలో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టారు.
పుష్ప2 ( Pushpa 2 ) సినిమాకు జాతర సీక్వెన్స్ హైలెట్ కానుందని భోగట్టా.రష్మిక( Rashmika ) ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమా కోసం రష్మిక 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం అందుతోంది.
ఈ సినిమాలో శ్రీలీల( Sreeleela ) కిస్సిక్ అనే స్పెషల్ సాంగ్ చేశారు.ఆ సాంగ్ కోసం శ్రీలీల 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాలో పీలింగ్స్ సాంగ్ పల్లవి అన్ని భాషల్లో మలయాళ వెర్షన్ లో ఉంది.మలయాళ ఫ్యాన్స్ పై అభిమానంతో బన్నీ ఈ విధంగా చేశారని తెలుస్తోంది.3 గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.అత్యధిక నిడివి గల తెలుగు సినిమాలలో పుష్ప2 ఒకటిగా నిలిచింది.