మన ఇంట్లో ప్రతి వస్తువుకు వాస్తుతో కచ్చితంగా సంబంధం ఉంటుంది.ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు కూడా వాస్తు ప్రకారం ఉంటే శుభ ఫలితాలు లభిస్తాయి.
ఇలా చేయడం వలన ఇంట్లో సానుకూలత వస్తుంది.అలాగే వాస్తుకు( Vasthu ) విరుద్ధంగా వస్తువులను ఉంచితే ఇంట్లో ప్రతికూల శక్తులు పెరుగుతాయి.
అలాగే చెడు ప్రభావాలు కూడా కనిపిస్తాయి.అందుకే ఇంట్లో అన్ని కూడా వాస్తు ప్రకారంగానే ఉండాలి.
అదేవిధంగా ఇంట్లో చల్లగా ఉంచడానికి కూడా సరైన దిశ ఉండాలి.వేసవికాలం వచ్చినప్పటి నుంచి ప్రజలు ప్రతి ఇంట్లో కూడా కూలర్లను అమర్చడం ప్రారంభించారు.
వాస్తు ప్రకారం కూలర్ సరైన దిశలో ఉంటే అక్కడ డబ్బును సంపాదించవచ్చు.అలాగే ఇంటికి ఆనందం, శ్రేయస్సును కూడా కొనసాగించుకోవచ్చు.

సరైన దిశలో ఉంచాకపోతే డబ్బు, ఆశుభ ఫలితాలు కూడా కలుగుతాయి.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తెల్లటి రంగు కూలర్ ఉంటే చాలా శుభ్రంగా పరిగణించబడుతుంది.ఇక వేరే ఇతర రంగును ఉంచాలనుకుంటే క్రీం లేదా సిల్వర్ కలర్ కూలర్లను ఉంచుకోవచ్చు.ఇది చాలా ప్రయోజనకరం.ఇప్పటికే ఇంట్లో కూలర్ కలిగి ఉన్నట్లయితే ఈ రంగులలో కూలర్ ను పెయింట్ కూడా చేయవచ్చు.ఇలా కాకుండా నీలం, ఎరుపు, బూడిద రంగుల కూలర్లను ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదని వాస్తు శాస్త్రంలో నమ్మకం.
ఇంట్లో ఈ రంగుల కూలర్ లతో చల్లగా ఉంచడం వలన ప్రతికూలత వస్తుంది.

అలాగే వాస్తు దోషం కూడా ఏర్పడుతుంది.ఇలాంటి రంగుల కూలర్ లను ఇంట్లో ఉంచడం వలన ఇంటి వాతావరణం కూడా అపరిశుభ్రంగా మారిపోతుంది.అంతేకాకుండా ఇంట్లో పాడైపోయిన కూలర్ లను కూడా ఉంచకూడదు.
దీని వలన ఆర్థిక పరిస్థితి దిగజారి పోతుంది.ఇంట్లో సమస్యలు, వాస్తు దోషం, ఇంటి పురోగతి కూడా ఆగిపోతుంది.
ఎప్పుడు కూడా ఈశాన్య కోణంలో చల్లగా ఉంచాలి.ఈ దిశని చల్లగా ఉంచడం వలన ఇంట్లో శ్రేయస్సు లభిస్తుంది.
ఇక కూలర్ ను వాయువ్య దిశలో ఉంచాలి.నైరుతి దిశలో చల్లగా ఉంచడం మానుకోవాలి.