జీవోలపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.జీవోలను అన్నింటినీ వెబ్ సైట్ లో పెట్టాలని చెప్పింది.
APEGAZETTE వెబ్ సైట్ లో తప్పనిసరిగా ప్రభుత్వ జీవోలను అప్ లోడ్ చేయాలని అన్ని శాఖలకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
అయితే కొన్ని శాఖలే జీవోలను వెబ్ సైట్ లో పెడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.2021 లో విడుదల చేసిన జీవో 100 నిబంధనలను అన్ని శాఖలు అమలు చేయాలని సర్కార్ ఆదేశించింది.







