ముఖ్యంగా చెప్పాలంటే వివాహం అయిన దగ్గర నుంచి ఏ ముఖ్యమైన శుభకార్యమైన మహిళలు పట్టు వస్త్రాలను ధరిస్తూ ఉంటారు.అలాగే ప్రతి వివాహంలోనూ మహిళలు ఎక్కువగా పట్టు వస్త్రాలను ధరిస్తూ ఉంటారు.
అలాగే ఈ మధ్యకాలంలో పట్టు చీరలను( Silk sarees ) ధరించడం ఫ్యాషన్ గా మారిపోయింది.అలాగే మహిళలకు పట్టు వస్త్రాలకు అభినాభావ సంబంధం ఉంది అని కచ్చితంగా చెప్పవచ్చు.
ఎందుకంటే రకరకాల రంగుల్లో ఎన్నో విధాల పట్టు వస్త్రాలు, చీరలు మనకి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.

అయితే పట్టు వస్త్రాలను ధరించడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఆధునిక శాస్త్రం, ధర్మ శాస్త్రం ప్రకారం ప్రతి ప్రాణి చుట్టూ ఓరా అనబడే సప్త వర్ణ కాంతి పుంజం ఉంటుంది.అది మన శరీర మానసిక స్థితులను( Mental states ) బట్టి మారుతూ ఉంటుంది.
అలాగే పట్టు వస్త్రాలు( Silk cloths ) ధరించినప్పుడు ఈ ఓరా ఎంతో శక్తివంతంగా, కాంతివంతంగా మారి చుట్టూ ఉన్నతమైన అనుకూల శక్తిని ఆకర్షించి, మన శరీరంలో ప్రవహింపజేసేలా చేస్తుందని పండితులు చెబుతున్నారు.

అందుకే పవిత్ర కార్యాచరణాలలోనూ పట్టు వస్త్రాలను ధరించమని చెబుతున్నారు.ఇలా ఉండడం మన ధర్మం అని పెద్దవారు ఎప్పుడు చెబుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే పట్టు పురుగులను వేడి నీళ్లలో వేసి వాటి పోగులను దారాలుగా పట్టు వస్త్రాలుగా నేస్తారు.
అలాగే మనసు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అత్యంత బాధను కలిగిస్తుంది.ప్రతి జీవికి ఒక పరమార్ధం కచ్చితంగా ఉంటుంది.అలాగే పట్టు పురుగుల పరమార్థం ఇదేనని నిపుణులు చెబుతున్నారు.







