కేరళ రాష్ట్రంలోని పతినంతిట్టా జిల్లాలోని శబరిమల దేవాలయానికి ప్రతి సంవత్సరం లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు.అయ్యప్ప స్వామి దీక్షను చేపట్టి వారు స్వామివారి దర్శనం కోసం శబరిమల రావడం అనేది ఆనవాయితీ.
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక,నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు.కరోనా నిబంధనలు ఉండడం వల్ల గత రెండు సంవత్సరాల నుంచి ఆలయ దర్శనానికి భక్తులు రావడానికి ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉండేది.
ఈసారి కరోనా నిబంధనలు తీసివేయడంతో ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు భారీగా స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే అవకాశం ఉందని కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
మనదేశంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ఈరోజు తిరిగి తెరవనున్నారు.
వార్షిక మండలం మకర వీళక్కు పుణ్య సమయం నవంబర్ 17వ తేదీన మొదలుకానుంది.దీంతో గురువారం నుంచి శబరిమల ఆలయ దర్శనాలు ప్రారంభం అవుతాయి.
దేవాలయం గర్భగుడిని బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన అర్చకుడి సమక్షంలో మరో అర్చకులు ఎన్ పరమేశ్వరన్ నంబూత్రి తెరిచే అవకాశం ఉంది.

దర్శనాల కోసం భక్తులు ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని దేవస్థానం తెలిపింది.41 రోజుల్లో పాటు జరిగే మండల పూజ ఉత్సవాలు డిసెంబర్ 27న ముగిసిపోతాయి.జనవరి 14 2023న మకర జ్యోతి తీర్థ యంత్రం కోసం మళ్లీ డిసెంబర్ 30న ఆలయం దేవాలయాన్ని తెరుస్తారు.
భక్తుల దర్శనం తర్వాత జనవరి 24 స్వామి వారి ఆలయాన్ని మూసివేస్తారు.గత రెండు సంవత్సరాలుగా ఉన్న కరోనా నిబంధనల వల్ల నిబంధనను ఎత్తివేయడం వల్ల ఈ సంవత్సరం భారీగా యాత్రికులు వచ్చే అవకాశం ఉంది.
ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను కేరళ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది.ఇప్పటికే ఈ ఏర్పాట్లు మొదలైనట్లు అధికారులు చెబుతున్నారు.