శ్రీ కృష్ణ పరమాత్ముడికి అష్ట భార్యలు ఉన్నారు.మొత్తం పదహారు వేల మంది భార్యలు ఉన్నారు అంటారు కానీ.
అదంతా నిజం కాదు.కృష్ణ భగవానుడు కేవలం ఎనిమిది మందిని మాత్రమే పెళ్లి చేసుకున్నాడు.
వారంతా ఎవరు, వారి పేర్లు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీ కృష్ముడి మొదటి భార్య రుక్మిణీ దేవి.
విదర్భ రాదైన భీష్మకుని పుత్రిక శ్రీ కృష్ణుడిని ప్రేమించింది.ఆమె సోదరుడు రుక్మి ఆమెకు శిశుపాలుడితో వివాహం చేయాలనుకున్నప్పటికీ.
శ్రీ కృష్ణుడు వచ్చి రుక్మణీని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు.రెండో భార్య సత్యభామ.
ఈమె సత్రాజిత్తు కుమార్తె.మూడో భార్య జాంబవంతుడి కుమార్తె అయిన బాంజవతి.
నాలుగో భార్య కాళింది.ఐదో భార్య భద్ర.
ఆమె శ్రీ కృష్ణుడి తండ్రి వసుదేవుడి చెల్లలు శ్రుతకీర్తి పుత్రిక.
ఆరో భార్య మిత్రవింద అవంతీ రాజు పుత్రిక.శ్రీ కృష్ణుడికి ఈమె మేనత్త కూతురు కూడా.ఏడో భార్య నాగ్నజితి.
కోసల దేశాధిపతి అయిన నగ్న జిత్తు కుమార్తె ఈమె.అంతే కాకుండా ఎనిమిదో భార్య అయినటువంటి లక్ష్మణ ముద్ర దేశాధిపతి కూతురు.ఈమె స్వయం వరంలో శ్రీ కృష్ణుడిని వరించింది.ఈ విధంగా కృష్ణ భగవానుడికి ఎనమండుగురు భార్యలు అష్ట మహిషులుగా విలసిల్లారు.కానీ అందరూ అనుకున్నట్లుగా గోపికలంతా శ్రీ కృష్ణుడి భార్యలు కారు.అలాగే అష్ట భార్యలతోనూ శ్రీ కృష్ణుడికి పదేసి మంది పిల్లలు పుట్టారు.
అలా మొత్తం కృష్ణుడికి 80 మంది సంతానం కల్గింది.