గరుడ పురాణం లో గర్భం దాల్చిన సమయంలో పాటించాల్సిన నియమాలు ఇవే..!

వివాహం అయిన సంవత్సరం నుంచే చాలా మంది జంటలు పిల్లలను వెంటనే కనాలని అనుకుంటూ ఉన్నారు.కానీ అదే సమయంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా అలాగే మంచి సంస్కారవంతులు గా, అన్ని అర్హతలు కలిగి ఉండాలని కూడా కోరుకుంటున్నారు.

 These Are The Rules To Be Followed During Pregnancy In Garuda Puranam , Garuda-TeluguStop.com

గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకు తల్లి ఆరోగ్యం ఆహారం, దినచర్య, యోగా మొదలైనవి కచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి.అదే విధంగా అష్టాదశ మహా పురాణాలలో( Ashtadasa Maha Puranas ) ఒకటైన గరుడ పురాణంలో గర్భం దాల్చిన సమయంలో పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రుతుక్రమం వచ్చినప్పుడు మహిళను గౌరవంగా చూసుకోవాలి.ఆ సమయంలో దంపతులు బ్రహ్మచర్యం( celibacy ) పాటించాలి.

ఇది ఉత్తమ శిశువుకు జన్మనివ్వడంలో ఉపయోగపడుతుంది.అలాగే రుతుస్రావం తర్వాత ఎనిమిదవ, 14వ రోజు గర్భధారణకు మంచిదని చెబుతున్నారు.

Telugu Ashtadasamaha, Celibacy, Pregnancy, Garuda Puranam, Vastu, Vastu Tips-Tel

ఫలితంగా పిల్లలు సమర్థులు మాత్రమే కాకుండా సద్గురువులు, అదృష్టవంతులుగా, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు.సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం గర్భం దాల్చడానికి శుభప్రదం అని వాటిని పవిత్రమైన రోజులుగా భావించవచ్చని గ్రంథాలు చెబుతున్నాయి.అంతేకాకుండా పంచాంగ సంబంధమైన అష్టమి, దశమి 12వ తేదీలు కూడా మంచివే.అలాగే గర్భం దాల్చడానికి శుభ నక్షత్రాలు కూడా ఉండాలి.వీటిలో రోహిణి, మృగశిర, హస్త, చిత్తా, పునర్వసు, అనురాధ, శ్రావణ, ధనిష్ట, శతభిషా, ఉత్తర, భాద్రపద, ఉత్తరాషాడ, నక్షత్రాలను శుభప్రదంగా భావిస్తారు.అలాగే గరుడ పురాణం( Garuda Puranam ) ప్రకారం స్త్రీ గర్భం దాల్చిన రోజున నక్షత్రం తిధిని బట్టి పిల్లల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

శుభదినం, శుభ నక్షత్రం, శుభ తిథిలలో గర్భంలో ఉన్న బిడ్డకు మంచి ఆరోగ్యంతో పాటు తెలివి తో ఉంటారు.ఎనిమిదవ, 14వ రోజు గర్భధారణకు మంచిదని చెబుతున్నారు.

ఫలితంగా పిల్లలు సమర్థులు మాత్రమే కాకుండా సద్గురువులు, అదృష్టవంతులు మంచి ప్రవర్తన కలిగిన కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు.మహిళలు గర్భం దాల్చిన రోజు నక్షత్రం తిధిని బట్టి పిల్లల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube