అమరావతి ఆర్-5 జోన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఈ మేరకు ధర్మాసనం వచ్చే వారం విచారణ చేపట్టనుంది.ఆర్-5 జోన్ వ్యవహారంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును అమరావతి రైతులు సుప్రీంలో సవాల్ చేశారు.రైతుల పిటిషన్ పై త్వరగా విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరారు.
ఈ క్రమంలో పిటిషన్ పై వచ్చే వారం విచారణ జరుపుతామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.







