తెలుగు సినిమా ఇండస్ట్రీలో కచ్చితంగా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టాప్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ తడుముకోకుండా చెప్పే ఏకైక పేరు రాజమౌళి.( Rajamouli ) మరి రాజమౌళి తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సుకుమార్( Sukumar ) మాత్రమే.
ఈ లెక్కల మాస్టారు ఏదైనా ఒక సినిమా తీస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా ఏదో ఒక క్యాలిక్యులేషన్ తో ముడిపడే ఉంటుంది.ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక రకమైన లెక్క అంతర్లీనంగా ఉంటుంది.
తీయడం అంటే ఈరోజుల్లో మామూలు విషయం కాదు ఒక చిత్రం విజయం సాధించాలన్న లేదా ఫ్లాప్ అయినా కూడా అందుకు తగిన కారణాలు ఉంటాయి.కానీ ఏ చిత్రమైన విజయం సాధించాలంటే దర్శకుడు మాత్రమే కష్టపడాల్సి ఉంటుంది.

ఇక సుకుమార్ విషయానికి వచ్చేసరికి ఆయన తీసే సినిమాల్లో ప్రతి చిత్రానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది.ఉదాహరణకు నాన్నకు ప్రేమతో సినిమా( Nannaku Prematho ) చూస్తే ఇందులో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు.సినిమా మొత్తం బట్టర్ ఫ్లై ఈక్వేషన్ తో( Butterfly Equation ) ఉంటుంది.మరి ఈ బట్టర్ ఫ్లై కాన్సెప్ట్ ఏంటి ? దీనికి సినిమాకు ముడి ఏంటి అంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి రాజేంద్రప్రసాద్ జగపతిబాబు చేతిలో మోసపోతాడు కాబట్టి ఆ తర్వాత జగపతిబాబు నీ జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో ఓడిస్తాడు.అంటే ఒక చోట జరిగే ఏ పనికైనా అంతకు ముందు జరిగిన ఏదో ఒక పనితో సంబంధం ఉండి ఉంటుంది దీనినే బట్టర్ ఫ్లై ఈక్వేషన్ అని అంటారు.

అయితే ఈ ఈక్వేషన్ తో సినిమా తీసిన మొట్టమొదటి డైరెక్టర్ సుకుమార్ కాదు.అంతకన్నా ముందే మరొక సినిమా కూడా వచ్చింది.అదే కమల్ హాసన్ హీరోగా నటించిన దశావతారం.
( Dashavataram Movie ) ఈ సినిమాలో రంగరాజన్ విగ్రహంతో పాటు ఆయన్ని కూడా సముద్రంలో కలిపేస్తారు.అలా ఆయన సముద్రంలో కలిసిన తర్వాతే సునామీలు వచ్చి రకరకాల జనాలు కూడా ఎఫెక్ట్ అవుతారు అని అంతర్లీనంగా దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు.
ఈ సినిమా కూడా బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ ని చూపిస్తుంది.