Ravi Teja : వామ్మో రవి తేజ మామూలు ముదురు కాదు..ఈసారి కేకో కేక

సినిమా హిట్ అవడం లేదా ఫ్లాప్ అవడం అనే సబ్జెక్టుతో ఎలాంటి సంబంధం లేకుండా సినిమాలు తీయడం అనేది కేవలం టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ స్టార్ అయినటు వంటి మాస్ మహారాజా రవితేజకు( Maharaja Ravi Teja ) మాత్రమే సాధ్యమవుతుంది.55 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా ఆయన సినిమాలు తీస్తూ వెళ్తున్నాడు ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు అయినా విడుదల చేస్తాడు.పోయిన ఏడాది ధమాకా తో సూపర్ డూపర్ హిట్టు కొట్టి ఆ తర్వాత చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య( Waltheru Veeraya ) చిత్రంలో అదరగొట్టాడు.ఇక ఇప్పుడు ప్రస్తుతం రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగానే మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టేసాడు రవితేజ.

 Ravi Teja Upcoming Movies 2-TeluguStop.com
Telugu Ravi Teja-Telugu Stop Exclusive Top Stories

ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.దీంతో పాటే 2024 సంక్రాంతికి ఈగల్ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ.ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

సితార బ్యానర్ లో మొట్టమొదటి సారి రవితేజ హీరోగా నటించబోతున్నాడు.ఈ సినిమాకు ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Ravi Teja-Telugu Stop Exclusive Top Stories

ఈ చిత్రంతో పాటు ధమాకాతో( Dhamaka ) శ్రీ లీల తో బంపర్ కలెక్షన్స్ సాధించిన రవితేజ మరోమారు శ్రీ లీల తో జోడి కట్టబోతున్నాడు.గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.బలుపు, డాన్ శీను, క్రాక్ అంటే సినిమాలు తీసిన గోపీచంద్ రవితేజ కి ఖచ్చితంగా ఈసారి హిట్ ఇస్తాడు అని అందరూ అనుకుంటున్నారు.మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను తీస్తుండగా ఈ చిత్రం ట్రాక్ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక చివరిగా రవితేజ నటించిన రావణాసుర చిత్రం ప్రేక్షకులను కాస్త నిరాశపరిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube