వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టుకోవాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు.వాస్త్రు శాస్త్రంలో( Vastru Shastra ) ఇంటి నిర్మాణం గురించి కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది.
అయితే ఇంట్లోని ఒక్కో దిక్కుకి ఒక్కో వాస్తు నియమం ఉంది.అందుకు అనుగుణంగానే గదులను కూడా ఏర్పాటు చేసుకోవాలి.
అప్పుడే మంచి జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఇంతకీ వాస్తు ప్రకారం వంటిల్లు ఏ దిశలో ఉండాలి? అలాగే వంటింట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులు ఎలా ఉండాలి? ఇలాంటి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో కచ్చితంగా కిచెన్ ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు( Scholars ) చెబుతున్నారు.ఆగ్నేయం అగ్ని దిశగా భావిస్తారు.ఒకవేళ ఆగ్నేయం దిశలో వీలుకాకపోతే వాయువ్య దిశలో అయినా వంటగదిని ఏర్పాటు చేసుకోవాలి.ఇక వాస్తు శాస్త్రం ప్రకారం వంటింటిని శుభ్రంగా ఉంచుకోవాలి.అలా చేస్తే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ( Positive energy ) వస్తుందని సూచిస్తారు.వంటిల్లు సరిగా ఉంటేనే ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారని వాస్తు పండితులు చెబుతున్నారు.
అలాగే స్టవ్ కు, సింక్ కు మధ్య సరైన దూరం ఉండాలని కూడా చెబుతున్నారు.ఇలా దూరం లేకపోతే ఇంట్లో ఉండే ఆడవారిపై ప్రభావం పడుతుంది.
అయితే వారు ఆరోగ్యపరంగా దుష్ప్రభావాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.వంటింట్లో సింక్ ఈశాన్య దిశలో ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అలాగే గ్యాస్ స్టవ్ ను ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు ఒకవేళ కిచెన్ ను దక్షిణ దిశలో నిర్మిస్తే సింక్ ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి.ఇక సింక్, స్టవ్ రెండూ కలిపి ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే స్టవ్ అగ్నికి సూచిక, సింక్ నీటికీ సూచిక.రెండు విరుద్ధమైనవి కావడంతో ఒకే చోట ఉండకూడదు.

ఉంటే ప్రతికూల ప్రభావం చూపిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.స్టవ్ కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.వంటింటిని ఏర్పాటు చేసుకునే వారు నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.గది మూలకు కనీసం ఒక అడుగు దూరంలో ఉంచడం ఉత్తమం అని వారు చెబుతున్నారు.
ఇక మిక్సర్లతో పాటు విద్యుత్ ఉపకరణాలు కూడా ఇంటికి ఆగ్నేయ దిశలోనే పెట్టుకోవాలని సూచిస్తున్నారు.