శ్రీరామచంద్రుడు( Lord rama ) గురించి రామాయణం గురించి భారత దేశంలో ఉన్న ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.శ్రీరాముడి గొప్పతనం అందరికీ తెలుసు.
ఒక వ్యక్తి ఇలా ఉండాలి అనే విషయానికి ఉదాహరణగా ముందుగా చూపించేది రాముడినే.అలాంటి రాముడి గురించి దాదాపు అందరికీ బాగా తెలుసు.
అలాగే రాముడి భార్య సీతా, సోదరుడు లక్ష్మణులు, భక్తుడు హనుమంతుడు గురించి మన భారతీయులకు బాగా తెలుసు.కానీ శ్రీరాములవారికి ఒక అక్క ఉన్నారు.
దీని గురించి చాలామందికి తెలియదు.ఆ శ్రీరామచంద్రమూర్తి కంటే ముందే దశరథ మహారాజు- కౌసల్య( Dasharatha )కు ఒక కుమార్తె జన్మించింది.
మరి ఈ శ్రీరామనవమి సందర్భంగా ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కౌసల్య పుత్ర కామేష్టి యాగం చేసిన తర్వాత శ్రీరాముడు జన్మించారని అందరికీ తెలుసు.అయితే ఈ పుత్రకామేష్టి యాగానికంటే ముందే దశరథ మహారాజు– కౌసల్యకు ఒక పుత్రిక జన్మించింది.ఈ పుత్రికకు శాంత అని నామకరణం చేశారు.
అయితే శాంతాదేవి అంగవైకల్యంతో జన్మించడంతో మహా ఋషులు ఇచ్చిన సలహా మేరకు ఆమెను దత్తత ఇచ్చారు.అంగ దేశ రాజైన రోమాపాదుడికి శాంత( Shanta devi )ను ఇచ్చారు.
అక్కడ ఆమెకు సరైన వైద్యం అందడంతో శాంతాదేవి తిరిగి మామూలు మనిషిగా మారింది.శాంతా ఎంతో గొప్ప అందగత్తె కూడా.
అంతేకాకుండా యుద్ధ కళ, హస్త కళల్లో ప్రావీణ్యం సాధించింది.

ఒకానొక సమయంలో విపరీతమైన కరువు వచ్చింది.ఎవరికీ ఏం చేయాలో తెలియదు.ఆ సమయంలో శాంతాదేవికి రుష్యశృంగ మహర్షిని ఇచ్చి వివాహం జరిపించారు.
రుష్యశృంగ మహర్షి ఒక యజ్ఞం నిర్వహించడంతో అంగ దేశం కరువు నుంచి బయటపడింది.ఒక రామాయణంలో మాత్రమే కాకుండా శాంతాకు సంబంధించి మరో ఆధారం కూడా ఉంది.
హిమాచల్ ప్రదేశ్ లో శాంతాదేవికి ఒక దేవాలయం కూడా ఉంది.ఈ దేవాలయంలో రుష్యశృంగ మహర్షి తో పాటు శాంత దేవి విగ్రహం కూడా ఉంటుంది.
ధర్మపత్నిగా శాంతాదేవి కూడా అక్కడి ప్రజల నుంచి పూజలను అందుకుంటుంది.