ఈ మధ్యకాలంలో చాలామంది ఆర్థిక పరిస్థితులు కలిసి రాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.
అయితే వాస్తు శాస్త్రం( Vastu Shastra ) ప్రకారం కొన్ని పరిహారాలు పాటించినట్లయితే ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.లవంగం కర్పూరంతో మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
జీవితంలో పురోగతిని తీసుకువచ్చే లవంగం, కర్పూరం వంటి పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

లవంగాలు,కర్పూరం( Cloves, camphor ) ప్రతి ఇంటిలోనూ ఉంటాయి.ఇవి మన వంటగదిలోనే కాకుండా పూజలో కూడా ఉపయోగిస్తారు.వాస్తు శాస్త్రం ప్రకారం మీ జీవితంలో పురోగతిని సూచించే లవంగా కర్పూరాన్ని కాల్చడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉద్యోగ ఇంటర్వ్యూలలో విజయం సాధించడానికి లవంగం, కర్పూరం తో ఈ పరిహారం చేస్తే కచ్చితంగా మీరు విజయం సాధిస్తారు.అలాగే మీరు ఇంటర్వ్యూ కోసం మీ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు, మీరు రెండు లవంగాలను తీసుకొని మీ నోటిలో ఉంచుకోవాలి.
మీరు మీ ఇంటర్వ్యూ స్థలానికి వెళ్ళినప్పుడు మీ నోటి నుంచి రెండు లవంగాలను తీసి బయట పడేయాలి.

ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్లి మీరు నమ్మే దేవుడిని ఒకసారి ధ్యానించాలి.ఈ పరిష్కారం చేయడం వల్ల మీకు ఉద్యోగం రావడమే కాకుండా మీరు చేసే ప్రతి పని కచ్చితంగా విజయం అవుతుంది.ఇంకా చెప్పాలంటే మీ సంపదను పెంచుకోవాలనుకుంటే కష్టపడి పని చేసిన తర్వాత కూడా విజయం సాధించలేకపోతే ఈ కర్పూర పరిహారం చేయడం వల్ల మీ సంపద అభివృద్ధి చెందుతుంది.
దీనికోసం మీరు ఎర్ర గులాబీ( red rose ) ని తీసుకొని అందులో కర్పూరం ముక్కను ఉంచి దానిని కాల్చిన తర్వాత దుర్గాదేవి పాదాల వద్ద ఎర్రటి పువ్వును ఉంచాలి.పూజ చేసిన తర్వాత మీ సంపాదన పెంచడానికి దుర్గామాతను ప్రార్థించాలి.
అలాగే మీరు రాత్రిపూట కర్పూరం, లవంగాలను కాల్చాలి.తర్వాత ఇంట్లో డబ్బుకు లోటు అస్సలు ఉండదు.
కర్పూరం రాత్రిపూట కాల్చడం వల్ల ఇంట్లోనే ప్రతికూల శక్తులు దూరంగా వెళ్తాయి అలాగే ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది.