మరణించిన వారి తో పాటు.. బతికున్న వారి ఫోటోలను ఫ్రేమ్ కడితే ఏమవుతుందో తెలుసా..?

మన దేశంలో చాలామంది ప్రజలు తమ ఇళ్లను వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.కానీ ఇంటి లోపల ఆ చిన్న చిన్న విషయాలను పరిగణలోకి తీసుకోరు.

 Do You Know What Happens If You Frame The Photos Of The Deceased Along With The-TeluguStop.com

ఫలితంగా కొన్ని సమస్యలను వారు ఎదుర్కొంటూ ఉంటారు.వాస్తు అంటే ఇంట్లోని అణువణువు వాస్తు ప్రకారమే( Vastu ) ఉండాలని చెబుతున్నారు.

అలాగే వాస్తు గురించి చాలా మందిలో కొన్ని సందేహాలు ఉంటాయి.మరణించిన వారి ఫోటోలు ఇంట్లో ఎక్కడ ఉంచాలి.

ఎక్కడ ఉంచకూడదు అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు.చనిపోయిన వారి ఫోటోలు పెట్టే దిశా ఆ ఇంట్లో సుఖసంతోషాలను నిర్ణయిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం, నిత్యం వారిని గుర్తు చేసుకోవడం వల్ల వారి ఆశీస్సులు ఉంటాయని చాలామంది ప్రజలు భావిస్తారు.

Telugu God, Scholars, Survivors, Vastu-Latest News - Telugu

అందుకే ఫ్రేమ్ కట్టించి ఇంట్లో గోడకు తగిలిస్తారు.ఇంట్లో ఉంటే చాలు కదా అని ఎక్కడంటే అక్కడ పెడితే అనుకున్న ప్రభావం రాకుండా ప్రతికూల ప్రభావం ఆ ఇంటిపై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ఇంతకీ మరణించిన వారి ఫోటోలు ( Photos of the deceased )ఇంట్లో ఏ దిశలో పెడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే చనిపోయిన పెద్దవారి పై ప్రేమ గౌరవంతో కొందరు ఆ ఫోటోలను పూజ గదిలో పెడుతూ ఉంటారు.చనిపోయిన వారు భగవంతునిలో కలిసిపోయారు కదా దేవుడి ఫోటోలతో( photos of God ) పాటు పెడితే తప్పేంటి అని కూడా వాదిస్తూ ఉంటారు.

కానీ వారిపై మీకు ఎంత ప్రేమ ఉన్న ఆ ఫోటోలను పూజ గదిలో అసలు పెట్టకూడదు.

Telugu God, Scholars, Survivors, Vastu-Latest News - Telugu

అంతేకాకుండా రోజు నిద్ర లేచిన వెంటనే ఆ ఫోటోలను చూసి నిద్ర లేస్తే వారి ఆశీస్సులు ఉంటాయని కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు.కానీ ఇలా అసలు చేయకూడదని పండితులు( Scholars ) చెబుతున్నారు.ఇలా చేస్తే చేతిలో డబ్బు నిలవదు.

ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు.అంతేకాకుండా బ్రతికున్న వారి ఫోటోలకు కలిపి మరణించిన వారి ఫోటో ఫ్రేమ్ చేయకూడదు.

చనిపోయిన వాళ్లతో బతికున్న ఉన్న వారి ఫోటోలు ఇంట్లో గోడలపై పెట్టకూడదు.ఆ ప్రభావం బ్రతికి ఉన్న వారి ఆయుష్షు పై పడుతుందని పండితులు చెబుతున్నారు.

అలాగే మరణించిన వారి ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు.వారి ఫోటోలను దక్షిణం వైపు మాత్రమే పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube