మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత స్పీడ్ గా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు.ఈ మేరకు ఫ్యాన్స్ కు మాట కూడా ఇచ్చారు.
చిరంజీవి ఫ్యాన్స్ కు మాట ఇచ్చి చెప్పినట్టుగానే వరుస సినిమాలను ప్రకటించాడు.ఆచార్య, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ వంటి సినిమాలతో వెంటవెంటనే గ్యాప్ లేకుండా వచ్చాడు.
కానీ ఈయన ఒక సినిమాతో బ్లాక్ బస్టర్ కొడితే మరో సినిమాతో ప్లాప్ అందుకుంటున్నాడు.

ఇటీవలే భోళా శంకర్ సినిమా( Bhola Shankar )తో వచ్చి ఆడియెన్స్ ను పలకరించాడు.ఇది అట్టర్ ప్లాప్ అయ్యింది.దీంతో చిరు ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు.
ఇక రీమేక్స్ జోలీ పోకుండా ఈ మధ్యనే ఆయన పుట్టినరోజు నాడు రెండు స్ట్రైట్ సినిమాలను ప్రకటించాడు.ఈ రెండు ఇంకా స్టార్ట్ కాలేదు.
అయితే ఇప్పుడు మెగాస్టార్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తాజాగా టాక్ మొదలయ్యింది.

అది కూడా సెన్సేషనల్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ కు ఓకే చెప్పాడని రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతానికి ఆ డైరెక్టర్ ఎవరో ఇంకా బయటకు రాకపోయినా ఇతడు కూడా స్టార్ డైరెక్టర్ అయి ఉండవచ్చు అనే ఊహాగానాలు మొదలయ్యాయి.మరి క్రేజీ కాంబో అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
చూడాలి ఆ డైరెక్టర్ ఎవరో.ఇక మెగాస్టార్ ప్రజెంట్ ప్రకటించిన రెండు సినిమాల్లో ఒకటి మెగా 156.
( Mega156 ) ఈ సినిమాను ఆయన కూతురు నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు కూడా ఇంకా డైరెక్టర్ ఫైనల్ కాకపోయినా కళ్యాణ్ కృష్ణ పేరు వినిపిస్తుంది.
ఇక మెగా 157 సినిమా కూడా ప్రకటన వచ్చింది.బింబిసార వంటి హిట్ అందుకున్న వసిష్ఠ తెరకెక్కించబోతున్నారు.
యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది.