మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నో పద్ధతులను ఆచారాలను పాటిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే మనిషి మరణించిన తర్వాత అతని ఆత్మ సంతృప్తి కోసం పితృ దేవతలకు పిండ ప్రధానాలు చేస్తూ ఉంటారు.
ఇలా ప్రతి ఏడాది పిండప్రధానాలు చేయటం వల్ల వారి ఆత్మ సంతోషిస్తుందని భావిస్తారు.ఇకపోతే ఈ పిండ ప్రధానం చేసే సమయంలో పిండప్రధానం సమర్పించిన తర్వాత ఆ పిండాన్ని కాకులు తినాలని చెబుతారు.
కాకులు తినటం వల్ల శుభం జరుగుతుందని పెద్ద వారి ఆత్మ సంతోషిస్తుందని భావిస్తారు.
మరి పెద్దలకు పెట్టిన పిండప్రధానం కాకులు తినకపోతే ఏం జరుగుతుందన్న సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుందని చెబుతారు అందుకే కాకులను బలి భక్కు అని పిలుస్తారు.
అంటే బలులను తినేది అని అర్థం.ఇలా కాకులు పిండప్రధానం తినడానికి రావడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే కాకిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
కాకి ఎంతో దీర్ఘకాలంగా జీవించే పక్షి అని చెప్పవచ్చు.రహస్య మైథునం అనుభవిస్తుంది.
కాకి ఒక కన్ను పితృదేవతలకు నివాసం అని చెబుతారు.
అందుకే పిండ ప్రధానం చేసే సమయంలో ఆ పిండాన్ని తినడం కోసం కాకులు వస్తే పితృదేవతలు ఎంతో సంతృప్తి చెందుతారని భావిస్తారు.అయితే కొన్నిసార్లు పిండ ప్రధానం చేసినప్పుడు రాకపోవడం రావడం అనేది వాటి ఇష్టంగా ఉంటుంది కనుక కాకి రాకపోతే పితృదేవతలు సంతృప్తి చెందలేదని భావిస్తారు.అంతేకాకుండా ఆ పిండాన్ని కాకులు తీసుకుంటే పితృదేవతలు సంతోష పడ్డారని పండితులు చెబుతుంటారు.
DEVOTIONAL