ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.55
సూర్యాస్తమయం: సాయంత్రం.6.49
రాహుకాలం: ఉ.10.30 మ12.00
అమృత ఘడియలు: చవితి సామాన్యం
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39
మేషం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాన్ని తొందర పడకుండ ఉండటం మంచిది.
వృషభం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
మిథునం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.
శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.
దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.ఆర్థిక నష్టాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.
సింహం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కన్య:
మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.మీ పాత స్నేహితులు కలుస్తారు.నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంది.
తుల:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
ధనుస్సు:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.
మకరం:
ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఎక్కువ ఖర్చులు చేయకూడదు.ఈరోజు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.
కుంభం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలోచించాలి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి దూరప్రయాణాలు చేస్తారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
మీనం:
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి తొందర పడకూడదు.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.