రక్తహీనత ( anemia )అనేది పిల్లల నుంచి పెద్దల వరకు చాలామందిలో కనిపించే రుగ్మత.రక్తహీనత అనేది శరీరంలో తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేనప్పుడు ఏర్పడే పరిస్థితి.
నీరసం, అలసట, తరచూ తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చర్మం పాలిపోవడం, చల్లని చేతులు మరియు కాళ్ళు, చేతులు లేదా పాదాలలో వాపు, పెళుసుగా ఉండే గోర్లు, నోటి పూత, తలనొప్పి ఇవన్నీ రక్తహీనత లక్షణాలు.వీటన్నిటికీ చెక్ పెట్టి రక్తహీనతను వదిలించుకునేందుకు కొందరు మందులు వాడుతుంటారు.
ఇంకొందరు ఆహారం ద్వారానే రక్తహీనతను దూరం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ఎంతో ఉత్తమం గా సహాయపడుతుంది.రెగ్యులర్ గా ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే మందులతో పని లేకుండానే రక్తహీనతను వదిలించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా బ్లెండర్ లో ఒక కప్పు పీల్ తొలగించిన పైనాపిల్ ముక్కలు ( Slices of pineapple )వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత అదే బ్లెండర్ జార్ లో ఒక అరటిపండును స్లైసెస్( Slices the banana ) గా కట్ చేసి వేసుకోవాలి.
అలాగే ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పాలకూర ఆకులు మరియు ఒక గ్లాసు ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలిపితే మన ఐరన్ రిచ్ పాలక్ పైనాపిల్ బనానా జ్యూస్ అనేది రెడీ అవుతుంది.

ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది.అలాగే బోలెడన్ని పోషకాలను కూడా కలిగి ఉంటుంది.మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే ఐరన్ కంటెంట్ అందుతుంది.హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి.రక్తహీనత పరారవుతుంది.అలాగే పాలకూర మరియు పైనాపిల్ రెండూ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి కణాల నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
అరటిపండు శరీరానికి తక్షణ శక్తిని చేకూరుస్తుంది.రక్తహీనత యొక్క లక్షణాలైన నీరసం అలసటను పోగొడుతుంది.
అంతేకాకుండా ఈ పాలక్ పైనాపిల్ బనానా జ్యూస్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా రక్షిస్తుంది.