ప్ర‌పంచంలోని అంద‌రూ శాకాహారుల‌యితే ఏమ‌వుతుందో తెలిస్తే షాక‌వుతారు!

ప్రపంచంలోని అంద‌రూ శాఖాహారులుగా మారితే ఏమి జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం ఊహ‌ మాత్రమే కాదు, ఈ అంశంపై పరిశోధన కూడా జరిగింది.ఈ పరిశోధనలో వెల్ల‌డైన‌ ఫలితాలు అంద‌రినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.

 What Would Happen If The World Suddenly Went Vegetarian?, Vegetarian, Vegetarian-TeluguStop.com

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో 2014, 2018 సంవత్సరాల్లో ప్ర‌పంచంలోని అంద‌రూ శాఖాహారులుగా లేదా మాంసాహారులుగా మారిపోతే ఏమ‌వుతుంద‌నే దానిపై పరిశోధన జరిగింది.ఈ పరిశోధన ప్రకారం మాంసాహారం అధికంగా తినేవారి నుంచి ప్రతిరోజూ 7.2 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది.అదే సమయంలో శాకాహారం తినేవారి నుంచి 2.9 కిలోల డయాక్సైడ్ మాత్రమే విడుదలవుతుంది.కొలంబియాలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్ తెలిపిన వివ‌రాల ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు శాఖాహారాన్ని స్వీకరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ఇది పర్యావరణం, ఆరోగ్యం రెండింటికీ మంచిది.

ఆహారపు అలవాట్లు మన పర్యావరణాన్ని ప్రభావితం చేస్తాయి.ప్ర‌పంచంలో రెడ్ మీట్‌ను మాత్రమే తొలగిస్తే, ఆహారం నుండి వెలువడే గ్రీన్‌హౌస్ గ్యాస్‌లో 60 శాతం తగ్గుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.2050 నాటికి మానవులందరూ శాఖాహారులుగా మారితే, దీనిలో 70 శాతం తగ్గుదల ఉంటుంది.ప్రపంచంలోని పన్నెండు బిలియన్ ఎకరాల భూమి వ్యవసాయ సంబంధిత పనులకు ఉప‌యోగ‌ప‌డుతుంది.ఇలా చేస్తే వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం త‌గ్గుతుంది.వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.ఆక్స్‌ఫర్డ్ కంప్యూటర్ మోడల్ స్టడీ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 2050 నాటికి శాఖాహారులుగా మారితే, అకాల మరణాల సంఖ్య 6 నుండి 10 శాతం వరకు తగ్గుతుంది.

ప్రజలు క్యాన్సర్, షుగర్, గుండెపోటు వంటి వ్యాధుల నుండి కూడా బయటపడతారు.మొత్తంగా చూస్తే మనం తినే ఆహారంలో కాస్త మార్పు తీసుకువ‌చ్చినా పర్యావరణానికి, మనకూ ఎంతో మేలు జరుగుతుంది.

What would happen if World went vegetarian

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube