లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయిన యూకే యువకుడు.. అతని మృతి వెనక ఎన్నో సందేహాలు..

ఇటీవల టైలర్ కెర్రీ(Tyler Kerry) అనే 20 ఏళ్ల బ్రిటిష్ యువకుడు హాలిడే ఎంజాయ్ చేయాలని టర్కీ(Turkey) వచ్చాడు.తన గ్రాండ్‌పేరెంట్స్ అయిన కొలెట్, రే కెర్రీ అలానే తన ప్రియురాలు అయిన మోలీ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఈ దేశానికి రావడం జరిగింది.

 Uk Youth Dies In Elevator Accident.. Many Doubts Behind His Death, Tyler Kerry,-TeluguStop.com

అయితే వీరు అంటాల్యా సిటీ, లారా బీచ్‌కు(Antalya City, Lara Beach) సమీపంలోని ఒక హోటల్‌లో స్టే చేశారు.దురదృష్టవశాత్తు టైలర్ ఈ హోటల్ లిఫ్ట్ షాఫ్ట్‌లో( lift shaft) పడిపోయాడు.

శుక్రవారం ఉదయం వేళ టైలర్‌ శవం లిఫ్ట్ షాఫ్ట్ అడుగుభాగంలో కనిపించింది.టైలర్‌ మామ అలెక్స్ ప్రైస్, స్థానిక సమయం ఉదయం 7 గంటలకు టైలర్‌ను కనుగొన్నట్లు తెలిపారు.

అత్యవసర సేవల బృందం వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ, అతన్ని కాపాడలేకపోయారు.అతను అక్కడే మృతి చెందాడని ప్రకటించారు.

Telugu Antalya, Britain, Tragedy, Hotel Shaft, Lara Beach, Nri, Turkey, Tyler Ke

మిస్టర్ ప్రైస్ ఈ విషయం గురించి తెలుసుకున్న తీరును వివరిస్తూ, “నా సోదరి ఫోన్ చేసి టైలర్‌ను లిఫ్ట్ షాఫ్ట్‌లో కనుగొన్నారని చెప్పింది.అంబులెన్స్ బృందం అతనిని బతికించడానికి ప్రయత్నించింది, కానీ చాలా ఆలస్యమైపోయింది” అని అన్నారు.ఈ ఘటనతో కుటుంబం తీవ్రంగా షాక్‌కు గురైంది.టైలర్ కెర్రీ (Tyler Kerry)మృతి చెందిన పరిస్థితులు ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అతని కుటుంబం డిమాండ్ చేస్తోంది.“ప్రస్తుతం మా వద్ద చాలా తక్కువ వివరాలు మాత్రమే ఉన్నాయి” అని మిస్టర్ ప్రైస్ అన్నారు.“మాకు సమాధానాలు కావాలి.” అనే డిమాండ్ చేశారు.

Telugu Antalya, Britain, Tragedy, Hotel Shaft, Lara Beach, Nri, Turkey, Tyler Ke

అంటాల్యాలోని బ్రిటిష్ కాన్సులేట్(British Consulate), వారి టూర్ ఆపరేటర్ టుయ్, టైలర్ కుటుంబానికి అండగా ఉన్నాయి.టైలర్ శవాన్ని యూకేకి తీసుకువచ్చే పనిలో వారు నిమగ్నమై ఉన్నారు.ఈ పని మంగళవారం నాటికి పూర్తవుతుందని వారు ఆశిస్తున్నారు.టైలర్‌కు జరిగిన ఈ విషాద సంఘటన తర్వాత, అతని అంత్యక్రియల ఖర్చుల సేకరణ కోసం ఒక ఫండ్‌రైజర్ ప్రారంభించబడింది.

గో ఫండ్‌మీ పేజీలో, టైలర్ కుటుంబం, “టైలర్ చాలా దయగల, ప్రేమగల యువకుడు.అతనిని కోల్పోవడం మాకు చాలా బాధ కలిగిస్తోంది” అని రాశారు.అతని ట్రావెల్ బీమా రవాణా ఖర్చులను భరించవచ్చు.కాగా అంత్యక్రియలు, స్మారక కార్యక్రమాల ఖర్చులను భరించడానికి విరాళాలు అడుగుతున్నారు.

బ్రిటిష్ విదేశాంగ, కామన్‌వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ ఈ కష్ట సమయంలో కుటుంబానికి సహాయం చేస్తున్నట్లు తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube