రక్తహీనత లేదా ఎనీమియా.ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో సర్వ సాధారణంగా కనిపిస్తున్న సమస్య ఇది.ఆహారపు అలవాట్లు, ఐరన్ కొరత, రుతు స్రావం, ప్రసవం, విటమిన్ల లోపం, విష జ్వరాలు ఎటాక్ చేయడం, ఎర్ర రక్త కణాలు తగ్గి పోవడం, ఏదైనా ప్రమాదంలో రక్తాన్ని కోల్పోవడం, పలు రకాల మందుల వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల రక్త హీనత బారిన పడుతుంటారు.కారణం ఏదైనప్పటికీ.
రక్త హీనత నివారించుకోకుంటే మాత్రం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ముఖ్యంగా అధిక నీరసం, చిన్న చిన్న పనులకే అలసి పోవడం, తరచూ తలనొప్పికి గురికావడం, ఫ్రీగా శ్వాస తీసుకోలేక పోవడం, ఛాతిలో నొప్పి, విపరీతమైన చలి ఇలా రక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
అందుకే ఆరోగ్య నిపుణులు రక్త హీనతను ఎంత త్వరగా నివారించుకుంటే అంత మంచిదని ఎప్పటికప్పుడు సూచిస్తుంటారు.
అయితే రక్త హీనతను తగ్గించడంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.అటు వంటి వాటిలో చికెన్, మటన్ వంటి మాంసాలు కూడా ఉన్నాయి.అవును, చికెన్, మటన్, చేపలు మొదలగు మాంసాహారాల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
అందుకే వారానికి ఒకటి లేదా రెండు సార్లు వీటిని తీసుకుంటే రక్త హీనత సమస్య బారి నుండీ త్వరగా బయట పడొచ్చు.
ఇక మాంసాహారాలతో పాటుగా ఖర్జూర పండ్లు, బ్రోకొలీ, పాలకూర, బచ్చలి కూర, క్యారెట్లు, చిలకడ దుంపలు, దానిమ్మ పండ్ల, బీట్ రూట్, నువ్వులు, డ్రైఫ్రూట్స్, త్రుణ ధాన్యాలు వంటివి తీసుకోవడం ద్వారా కూడా రక్త హీనత సమస్యను నివారించుకోవచ్చు.
కాబట్టి, ఈ ఆహారాలను ఎవరైతే రక్త హీనత సమస్యతో బాధ పడుతున్నారో వారు ఖచ్చితంగా తమ డైట్‌లో చేర్చుకుంటే మంచిది.