కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్( Finance Minister Nirmala Sitharaman ) మధ్యతరగతి ప్రజలకు ఉపశమనాన్ని కలిగించింది.రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయం నెలకు సుమారు రూ.1 లక్ష కలిగిన వ్యక్తులను ఆదాయపు పన్ను నుంచి మినహాయించారు.అదనంగా జీతదారుల కోసం రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను అందుబాటులో ఉంచడంతో ఈ మినహాయింపు పరిమితి రూ.12.75 లక్షలకు పెరిగింది.దీనితో మధ్యతరగతి ప్రజలపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

ఫలితంగా వారి చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండేలా చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో పేర్కొన్నారు.ఈ నిర్ణయం గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడులపై ( household consumption, savings and investments )సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఆమె తెలిపారు.వాటి వివరాలు ఇలా .0-4 లక్షల వరకు పన్ను లేదు, 4-8 లక్షల వరకు 5 శాతం పన్ను, 8-12 లక్షల వరకు 10 శాతం పన్ను, 12-16 లక్షల వరకు 15 శాతం పన్ను 16-20 లక్షల వరకు 20 శాతం పన్ను, 20-24 లక్షల 25% పన్ను, రూ.24 లక్షలకు పైబడి 30%గా తెలిపారు.

ఇక తగ్గించిన పన్ను స్లాబ్‌లతో, సంవత్సరానికి రూ.12 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు ఆదాయపు పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు పొందుతారు.దీంతో, ఈ ఆదాయ పరిధిలో ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి పన్ను భారం ఉండదు అనే చెప్పాలి.ఈ మార్పులు పన్ను చెల్లింపుదారులకు ఉల్లాసాన్ని అందించినప్పటికీ, ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపుతాయి.తాజా ప్రతిపాదనల కారణంగా ప్రత్యక్ష పన్నుల (ఆదాయపు పన్ను) ద్వారా రూ.1 లక్ష కోట్ల మేరకు ఆదాయ నష్టం వాటిల్లనుందని అంచనా.అదనంగా, GST, కస్టమ్స్ సుంకాలు వంటి పరోక్ష పన్నుల్లో దాదాపు రూ.2,600 కోట్ల మేర నష్టం ఉంటుంది.అయినప్పటికీ, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆదాయ నష్టంగా భరించేందుకు సిద్ధంగా ఉన్నటు సమాచారం .