కొత్త హీరోయిన్ కు స్టార్ హీరో ప్రభాస్ ఇచ్చిన ఆతిథ్యం ఇదే.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం వరుసగా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు డార్లింగ్ ప్రభాస్.

 Prabhas Treats Actress Imanvi Home Food Details, Prabhas, Actress Imanvi, Prabha-TeluguStop.com

ఇకపోతే ఆయనతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇంటి వంటను రుచి చూపిస్తారు అన్న విషయం తెలిసిందే.తను నటించే మూవీ సెట్ లో ప్రతి ఒక్కరి కోసం ఇంటి నుంచి ప్రత్యేకంగా భోజనం తెప్పిస్తూ ఉంటారు.

అందుకే ప్రభాస్ ని భోజనం ప్రియుడు అని పిలుస్తూ ఉంటారు.సినిమా షూటింగ్‌ లో ఆయన ఉన్నారంటే చాలు, అక్కడ ఉన్న వారందరికీ భోజన ఏర్పాట్లను ప్రభాసే చూసుకుంటారు.

Telugu Actress Imanvi, Fauji, Imanvi, Prabhas, Prabhas Imanvi, Tollywood-Movie

ఈ క్రమంలో ఆయన ఇచ్చే ఆతిథ్యం గురించి ఇండస్ట్రీలోని స్టార్స్‌ అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు.ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.పాన్‌ ఇండియా స్టార్‌ గా ఆయన ఎదిగినప్పటికీ చిత్ర యూనిట్‌ వారికి ఆతిథ్యమివ్వడం అన్నది మాత్రం వదిలి పెట్టలేదు.ప్రభాస్‌ ఇంటి భోజనమంటే బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా లొట్టలేసుకుని ఆరగించేస్తారు.

అయితే తాజాగా తన హీరోయిన్‌ కు ప్రభాస్‌ ఇంటి నుంచి క్యారేజీ వెళ్లింది.ఇదే విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌ లో పోస్ట్‌ చేసింది.

ఆ బ్యూటీ మరెవరో కాదు ఇమాన్వీ.( Imanvi )

Telugu Actress Imanvi, Fauji, Imanvi, Prabhas, Prabhas Imanvi, Tollywood-Movie

తాజాగా ఈ ఢిల్లీ బ్యూటీకి కి ప్రభాస్‌ ఆతిథ్యం ఇచ్చారు.తన ఇంటి నుంచి ఆమెకు క్యారేజీ పంపారు.భోజనం చాలా బాగుంది అంటూ ఆమె ఒక వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది.

ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి( Hanu Raghavapudi ) దర్శకత్వంలో ఒక పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.మైత్రీ మూవీ మేకర్స్‌ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమం జరిగింది.షూటింగ్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి.

భారీ బడ్జెట్‌ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ భారీ ప్రాజెక్ట్‌తోనే ఇమాన్వీ ఎస్మాయిల్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌గా నెటిజన్లకు ఆమె సుపరిచితురాలు.ఇన్‌స్టాలో ఆమె డ్యాన్స్‌ రీల్స్‌ కు చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు.

అలా ఆమెకు సినిమా అవకాశం దక్కింది.ఈ సినిమానే ఆమెకు తొలి ప్రాజెక్ట్‌ కావడం విశేషం.

కొత్త హీరోయిన్లకు కూడా ప్రభాస్‌ ఆతిథ్యం ఇవ్వడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు.ఆయన ఎంత రేంజ్‌కు చేరుకున్నా కూడా ఇలాంటి విషయంలో ఏంత మాత్రం తగ్గడంటూ ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం ఇమాన్వి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో ప్రభాస్ పై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube