వరుణ్ సందేశ్, అప్సరా రాణి, విజయ్ శంకర్ (Varun Sandesh, Apsara Rani, Vijay Shankar)లు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం రాచరికం(racharikam).తాజాగా జనవరి 31వ గ్రాండ్ గా ఈ సినిమా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సురేష్ లంకలపల్లి (Suresh Lankalapally)దర్శకత్వం వహించిన ఈ సినిమాను చిల్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో ఈశ్వర్ నిర్మించారు.ఈ సినిమా ఎలా ఉంది కథ ఏమిటి చివరికి ఏమైంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కథ.

1980 ల నేపథ్యంలో రాచకొండలో కథ మొదలవుతుంది.భార్గవి రెడ్డి (అప్సర రాణి), వివేక్ రెడ్డి (వరుణ్ సందేశ్) (Bhargavi Reddy (Apsara Rani), Vivek Reddy (Varun Sandesh))తోబుట్టువులు.వీరు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.శివ( విజయ్ శంకర్) మన శక్తి పార్టీ యువ నాయకుడు.క్రాంతి (ఈశ్వర్)ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకుడు.అయితే శివ, భార్గవి రెడ్డి ఒకరినొకరు ప్రేమించుకుంటారు.
వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి భార్గవి రెడ్డి(Bhargavi Reddy) తండ్రి రాజారెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్)(Srikanth Iyengar) కి తెలియడంతో భార్గవి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది.ఇంతకీ ఆ ఊహించని మలుపు ఏంటి వీరి ప్రేమకు రాజకీయం అడ్డు వస్తుందా? అలాగే వీరి ప్రేమ వల్ల రాచకొండలో ఎలాంటి హింసాత్మక పరిణామాలు ఏర్పడ్డాయి? తోబుట్టువుల మధ్య ఎలాంటి కథ జరిగింది ఈ విషయాలు అన్నీ తెలియాలి అంటే తప్పకుండా సినిమాను చూడాల్సిందే.
విశ్లేషణ.

డైరెక్టర్ సురేష్ లంకలపల్లి (Suresh Lankalapally)ఈ సినిమాను చాలా బాగా చక్కగా తెరకెక్కించారు.సినిమాలోని కొన్ని కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులు ముందుగానే ఊహించగలరు.అదేవిధంగా ఇందులో చాలా సీన్లలో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి.
డైరెక్టర్ సురేష్ కు మొదటి సినిమా అయినప్పటికీ చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా ఈ సినిమాను చాలా బాగా రూపొందించారు.ఎమోషన్స్ కామెడీ, రిలేషన్స్ కనెక్ట్ చేయడంలో సక్సెస్ అని చెప్పాలి.
కాగా ఈ సినిమాకు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలం అని చెప్పవచ్చు.మంచి పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్.
నటీనటుల పనితీరు.

హీరో వరుణ్ సందేశ్ ఈ సినిమా ద్వారా తనలో ఉన్న మరో కొత్త కోణాన్ని చూపించాడు.ఈ చిత్రం లోని వరుణ్ యాక్టింగ్ కొత్తగా అనిపిస్తుంది.తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు వరుణ్ సందేశ్.
అలాగే అప్సర రాణి కూడా మూడు విభిన్నమైన షేడ్స్ లో నటించి ప్రేక్షకులను బాగానే నేర్పించింది.హీరో విజయ్ శంకర్ మంచి ఎమోషన్స్ తో ఫర్ఫార్మెన్స్ ను ఇరగదీసాడని చెప్పాలి.
కెరీర్ బెస్ట్ రోల్ గా విజయ్ శంకర్ అదరగొట్టేశాడు.నిర్మాత ఈశ్వర్ ఆర్‌ఎస్‌ఎఫ్ లీడర్‌గా అసాధారణమైన నటనను కనబరిచాడు.
శ్రీకాంత్ అయ్యంగార్ కూడా మరోసారి తనదైన నటనతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు.విజయ రామరాజు యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటుంది.
అలాగే లుక్స్ పరంగా కూడా అదరగొట్టాడని చెప్పాలి.ఇందులో విజయ రామరాజు యాక్టింగ్ ని ప్రేక్షకులు అంత తొందరగా మరిచిపోలేను.
చాలా అద్భుతంగా నటించి ముప్పించారు విజయ రామరాజు.మిగిలిన నటీనటులు అయిన ప్రాచీ ఠాకర్,రూపేష్, ఫణి, సతీష్ సారిపల్లి, ఆది, రంగస్థలం మహేష్ లు ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారని చెప్పాలి.
సాంకేతికత
ఇకపోతే ఈ సినిమా సాంకేతికత విషయానికొస్తే.ఆర్య సాయికృష్ణ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి.
కొన్ని సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.కెమెరా వర్క్స్ కూడా బాగున్నాయి.
సాంగ్స్ కూడా ఫర్వాలేదు.ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
వెంకీ నేపథ్యం సంగీతం ఫర్వాలేదు అనిపించారు.నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.మ్యూజిక్ కూడా బాగానే ఉంది.
రేటింగ్
3/5