విలనిజంలో ట్రెండ్ సృష్టించిన రావు గోపాల్ రావు.. చివరి రోజుల్లో ఇన్ని కష్టాలు పడ్డారా?

తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త విలనిజాన్ని పరిచయం చేసి విలనిజంలో కూడా ట్రెండ్ క్రియేట్ చేయవచ్చు అని నిరూపించాడు రావుగోపాలరావు.రావు గోపాల్ రావు పేరు చెబితే చాలు అటు తెలుగు ప్రేక్షకుల కళ్ళ ముందు ఎన్నో విభిన్నమైన విలన్ పాత్రలు మెదులుతూ ఉంటాయి అని చెప్పాలి.

 How Rao Gopala Rao Led His Life In Last Days , Rao Gopala Rao, Allu Ramalingaiah-TeluguStop.com

పవర్ఫుల్ విలన్ గా కామెడీ విలన్ గా కంజూస్ విలన్గా ఇలా చెప్పుకుంటూ పోతే విలనిజంలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలను అవపోసన పట్టాడు రావు గోపాల్ రావు.ఇక ఆయన విలనిజాన్ని చూస్తూ ప్రేక్షకులందరూ థియేటర్లో చప్పట్లు కొడుతూ ఉంటే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయేది అని చెప్పాలి.

రంగస్థల నటుడిగా జీవితాన్ని ప్రారంభించి సినీరంగంలో దిగ్గజ నటుడిగా ఎంతగానో గుర్తింపును సంపాదించుకున్నారు.ఇక వందల సినిమాల్లో నటించిన రావు గోపాల్ రావు చివరి దశలో మాత్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి అనారోగ్య సమస్యతో బాధపడుతూ చనిపోయాడట.1994 లో రావు గోపాలరావు తుదిశ్వాస విడిచారు.అయితే ఆయనకు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది పెద్ద పెద్ద దర్శకులు నిర్మాతల తో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ఎవరు కూడా రావు గోపాల్ రావు భౌతిక కాయాన్ని చూడడానికి నివాళులు అర్పించడానికి రాకపోవడం గమనార్హం.

Telugu Raogopala, Jaikrishna, Rao Gopala Rao-Telugu Stop Exclusive Top Stories

అల్లు రామలింగయ్య రేలంగి నరసింహారావు నిర్మాత జై కృష్ణ పి.ఎల్.నారాయణ సహా కొంతమంది మాత్రమే ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు.1937 జనవరి 14 న జన్మించిన రావుగోపాలరావు బాపు దర్శకత్వంలో ముత్యాలముగ్గు సినిమాలో నటించగా ఈ సినిమా ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది.సినిమాల్లో మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలి అంటూ కాస్త డిఫరెంట్ డైలాగ్ చెప్పి ఒక్కసారిగా తెర మీదికి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు.అయితే ఒకానొక సమయంలో మాత్రం అందర్నీ గుడ్డిగా నమ్మి ఆర్థిక సహాయం చేయడం ద్వారా చివరిరోజుల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారట ఆయన.అందరికీ ఆర్థిక సహాయం చేయడం ఎవరూ తిరిగి ఇవ్వకపోవడం.అదేసమయంలో తన దగ్గర ఉన్న డబ్బును ఇక చికిత్స కోసం ఖర్చు పెట్టడం లాంటివి చేసి చివరి రోజుల్లో ఎన్నో బాధలు పడ్డారట రావు గోపాల్ రావు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube