2025, ఫిబ్రవరి 1 నాటికి మన దేశంలో పెట్రోల్ రేట్లు( Petrol Prices ) మంట పుట్టిస్తున్నాయి.ముంబైలో లీటర్ పెట్రోల్ ధర అక్షరాలా రూ.105.01. ఢిల్లీలో అయితే కొంచెం తక్కువ రూ.94.77.బండి నడపాలంటేనే సామాన్యుడి గుండె గుభేలుమంటోంది.ప్రభుత్వం మాత్రం గొప్పలు చెబుతోంది కానీ, ప్రజల నడ్డి విరిచేలా పెట్రోల్ రేట్లు పెంచడంలో మాత్రం రికార్డులు కొడుతోంది.ఇక అసలు విషయానికి వస్తే, ప్రపంచంలోనే ఏ దేశాల్లో పెట్రోల్ నీళ్లకంటే చౌకగా దొరుకుతుందో తెలుసా?
1.ఇరాన్:
ప్రపంచంలోనే చౌక పెట్రోల్ ఇరాన్‌లోనే( Iran ) దొరుకుతుంది.లీటర్ పెట్రోల్ ధర కేవలం 0.029 డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.2.51 పైసలు మాత్రమే.ఇరాన్‌లో చమురు నిల్వలు పుష్కలంగా ఉండటం, ఉత్పత్తి ఖర్చులు తక్కువగా ఉండటంతో ప్రభుత్వం ప్రజలకు భారీ సబ్సిడీలు ఇస్తోంది.కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది.చుట్టుపక్కల దేశాలకు ఎక్కువ ధరకు అమ్మడం, దేశీయంగా వాడకం ఎక్కువ కావడంతో ఇరాన్‌కు ఇబ్బందులు తప్పడం లేదు.
2.లిబియా:
చౌక పెట్రోల్ లిస్టులో లిబియా ( Libya ) రెండో స్థానంలో ఉంది.ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర 0.031 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.2.51. ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద చమురు నిల్వలు లిబియాలోనే ఉన్నాయి.అందుకే ఇక్కడ పెట్రోల్ రేట్లు తక్కువగా ఉంటాయి.
కానీ ఇక్కడ కూడా సమస్య ఉంది.చుట్టుపక్కల దేశాలకు పెట్రోల్‌ను స్మగ్లింగ్ చేయడం వల్ల దేశానికి భారీగా నష్టం వాటిల్లుతోంది.
3.వెనెజులా:
వెనెజులాలో లీటర్ పెట్రోల్ ధర 0.035 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.3.03. ఇక్కడ కూడా ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇస్తోంది.పెట్రోల్ రేట్లు తక్కువగా ఉన్నా, ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.దీంతో పెట్రోల్ కొరత ఏర్పడింది.
4.అంగోలా:
అంగోలాలో( Angola ) లీటర్ పెట్రోల్ ధర 0.328 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.28.44.చమురు ఉత్పత్తిలో అంగోలా పెద్దన్న.సబ్సిడీలతో రేట్లు అందుబాటులో ఉంచుతోంది.కానీ ఇక్కడ కూడా పేదరికం ప్రజలను వెంటాడుతోంది.అందరికీ సమానంగా పెట్రోల్ అందుబాటులో ఉండటం లేదు.
5.ఈజిప్ట్:
ఈజిప్టులో( Egypt ) లీటర్ పెట్రోల్ ధర 0.339 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.29.39 పైసలు. ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నా, ఆర్థిక పరిస్థితులు మారడంతో వాటిని కొంచెం తగ్గించింది.
6.అల్జీరియా:
అల్జీరియాలో లీటర్ పెట్రోల్ ధర 0.340 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.29.48 పైసలు. చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నా, ఆర్థిక వ్యవస్థ మాత్రం చమురుపైనే ఆధారపడి ఉంది.
7.కువైట్:
కువైట్‌లో( Kuwait ) లీటర్ పెట్రోల్ ధర 0.341 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.29.56 పైసలు.కువైట్ కూడా చమురు నిల్వలకు పెట్టింది పేరు.ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడంతో పెట్రోల్ రేట్లు తక్కువగా ఉన్నాయి.
8.తుర్క్‌మెనిస్తాన్:
తుర్క్‌మెనిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ ధర 0.428 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.37.11 పైసలు.ప్రభుత్వం ధరలను కంట్రోల్ చేస్తూ సబ్సిడీలు ఇవ్వడంతో పెట్రోల్ రేట్లు చౌకగా ఉన్నాయి.
9.మలేషియా:
మలేషియాలో లీటర్ పెట్రోల్ ధర 0.467 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.40.49 పైసలు.మలేషియా చమురును ఎగుమతి చేస్తుంది.ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడంతో రేట్లు తక్కువగా ఉన్నాయి.
10.కజకిస్తాన్:
కజకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ ధర 0.473 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.41.01 పైసలు.కజకిస్తాన్‌లో చమురు, గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉండటంతో పెట్రోల్ రేట్లు తక్కువగా ఉన్నాయి.
• ఇండియా, పాకిస్తాన్ ఎక్కడో తెలుసా:
ఇక మన పరువు పోయే విషయం ఏమిటంటే, పెట్రోల్ ధరల విషయంలో పాక్ మనకంటే ఎంతో ముందుంది.పాకిస్తాన్( Pakistan ) 36వ స్థానంలో ఉండగా, అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.79.67 మాత్రమే.కానీ మన ఇండియా( India ) మాత్రం ఏకంగా 73వ స్థానంలో ఉంది.
కారణం ఏమిటంటే మన దేశంలో పెట్రోల్‌పై సబ్సిడీలు చాలా తక్కువగా ఉండటమే.
మోదీ సర్కార్( Modi Government ) పాలనలో పెట్రోల్ ధరలు బాగా పెరిగిపోయాయి అనేది చాలామంది విమర్శిస్తుంటారు.
పెట్రోల్ ధరలు తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.కానీ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోంది.
ఇంకెంత కాలం సామాన్యుడు ఈ పెట్రోల్ మంటల్లో బతకాలి? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అంతేకాదు, మనదేశంలో పెట్రోల్ ధరలు మండిపోవడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయని చెబుతున్నారు వారి ప్రకారం అధిక పన్నులు మొదటి కారణం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌పై అధిక ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ విధిస్తున్నాయి.దీనివల్ల బేస్ ధర తక్కువగా ఉన్నా, వినియోగదారులకు చేరేసరికి రేటు బాగా పెరుగుతోంది.ఇది ప్రభుత్వ విధాన నిర్ణయం.
మరో కారణం తక్కువ సబ్సిడీలు, ఇతర దేశాలతో పోలిస్తే, భారత్ పెట్రోల్‌పై తక్కువ సబ్సిడీలు అందిస్తోంది.
పాక్ వంటి దేశాలు ఎక్కువ సబ్సిడీలు ఇవ్వడం వల్ల అక్కడ ధరలు తక్కువగా ఉన్నాయి.ప్రభుత్వాల విధానాల ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.
https://x.com/DhrithiManohar/status/953622707999932417?t=noLMosMXw__74viDuYcsCg&s=19
.