సాధారణంగా కొందరికి ముఖంపై నల్లటి మచ్చలు( Dark Spots ) ఏర్పడుతుంటాయి.ఇవి మొత్తం అందాన్ని పాడు చేస్తాయి.
నల్ల మచ్చలు కారణంగా అద్దంలో ముఖాన్ని చూసుకోవడానికి కూడా సంకోచిస్తుంటారు.నల్లటి మచ్చలను వదిలించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తుంటారు.
అయితే పైసా ఖర్చు లేకుండా ముఖంపై నల్లటి మచ్చలను మాయం చేసే ఒక మ్యాజికల్ రెమెడీ ఉంది.ఈ రెమెడీని ఫాలో అయ్యారంటే మచ్చలేని చర్మం మీ సొంతం అవుతుంది.
అందుకోసం ముందుగా ఒక టమాటోను( Tomato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, కొన్ని పుదీనా ఆకులు( Mint Leaves ) వేసి ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, చిటికెడు ఆర్గానిక్ పసుపు వేసుకోవాలి.అలాగే సరిపడా టమాటో కొత్తిమీర ప్యూరీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై కూల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటించారంటే కొద్ది రోజుల్లోనే ముఖంపై మచ్చలు తగ్గుముఖం పడతాయి.స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది.