మన బాడీ క్లీన్( Body clean ) గా, ఫిట్ గా మరియు హెల్తీగా ఉండాలి అంటే కచ్చితంగా డైట్ లో పోషకాహారం ఉండేలా చూసుకోవాలి.కానీ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు కడుపు నింపుకోవడం కోసం చాలా మంది ఏదో ఒక చెత్తను కడుపులోకి తోసేస్తుంటారు.
ఆ చెత్త కాస్త మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.అందుకే హెల్తీ డైట్( Healthy diet ) ను మరీ స్ట్రిక్ట్ గా కాకపోయినా కొంచెమైనా ఫాలో అవ్వాలి.
కనీసం కొన్ని కొన్ని మంచి ఆహారాలను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించాలి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఫ్రూట్ జ్యూస్ వారానికి రెండు సార్లు తీసుకున్న చాలు. బాడీ క్లీన్ గానే కాకుండా ఫిట్ గా, హెల్తీగా సైతం మారుతుంది.మరి ఇంతకీ ఆ ఫ్రూట్ జ్యూస్ ఏంటి అనేది ఓ చూపు చూసేయండి.
ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు పైనాపిల్ ముక్కలు, ఒక కప్పు ( Slices of pineapple )బొప్పాయి పండు ముక్కలు, అరకప్పు స్ట్రాబెర్రీ పండు ముక్కలు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon juice ) మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.లేదా నేరుగా కూడా తీసుకోవచ్చు.ఈ ఫ్రూట్ జ్యూస్ ( Fruit juice )లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె తో పాటు అనేక రకాల మినరల్స్ మరియు ఫైబర్ నిండి ఉంటాయి.అందువల్ల ఈ ఫ్రూట్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, మలినాలు తొలిగిపోతాయి.
లివర్, కిడ్నీలు శుభ్రంగా మారతాయి.శరీరం బరువు అదుపులో ఉంటుంది.
గుండెపోటు, క్యాన్సర్, మధుమేహంతో సహా అనేక జబ్బులకు దూరంగా ఉండవచ్చు.బాడీ ఫిట్ గా, హెల్తీ గా మారుతుంది.
కాబట్టి కనీసం వారానికి రెండు సార్లైనా ఈ పైనాపిల్ పపాయ స్ట్రాబెర్రీ జ్యూస్ ను రోజూ తాగితే ఇంకా మంచిది.