ఖలిస్తానీలకు కెనడియన్ సిక్కులకు సంబంధం లేదు : ట్రూడో సంచలన వ్యాఖ్యలు

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) తీరు విమర్శల పాలవుతుంది.ఇప్పటికే భారత్ – కెనడాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ తినడానికి కారణమైన ట్రూడో తన తీరును ఏమాత్రం మార్చుకోవడం లేదు.

 Khalistani Separatists Dont Represent Sikh Community In Canada Says Justin Trude-TeluguStop.com

ట్రూడో అండ చూసుకుని కెనడాలో ఖలిస్తాన్ మద్ధతుదారులు( Khalistan Supporters ) రెచ్చిపోతున్నారు.ఇటీవల బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంపై దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు.కెనడాలోని సిక్కు సమాజానికి( Sikh Community ) ఖలిస్తానీ వేర్పాటువాదులు ప్రాతినిథ్యం వహించడం లేదన్నారు.

Telugu Bramptonhindu, Canada, Canadapm, Canadasikh, India Canada, Justin Trudeau

దీపావళి, బండి చోర్ దివాస్‌ పర్వదినాలను పురస్కరించుకుని ఒట్టావాలోని పార్లమెంట్‌ హిల్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమానికి చాలా మంది మద్ధతుదారులు ఉన్నారని, కానీ వారిలో చాలా మంది సిక్కు మతానికి ప్రాతినిథ్యం వహించరని అన్నారు.బ్రాంప్టన్‌లోని హిందూ మందిర్‌పై( Hindu Temple ) ఖలిస్తాన్ అనుకూలవాదుల హింసాత్మక దాడి తర్వాత ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.కెనడాలో హింస, అసహనం, బెదిరింపులకు , విభజనకు చోటు లేదని ట్రూడో అన్నారు.

Telugu Bramptonhindu, Canada, Canadapm, Canadasikh, India Canada, Justin Trudeau

కెనడాలో ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) ప్రభుత్వానికి చాలా మంది మద్ధతుదారులు ఉన్నారని.కానీ వారు మొత్తం హిందూ కెనడియన్లకు ప్రాతినిథ్యం వహించరని చెప్పారు.జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలపై బ్రిటీష్ కొలంబియా మాజీ ప్రీమియర్, భారత సంతతికి చెందిన ఉజ్జల్ దోసాంజ్ స్పందించారు.సిక్కు సామాజాన్ని ఖలిస్తానీల నుంచి వేరుగా గుర్తించడం బహుశా ఇదే మొదటిసారి అన్నారు.

అలాగే కెనడియన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కెనడియన్ సిక్కులను ఖలిస్తానీలుగా చిత్రీకరించడాన్ని ఉజ్జల్ తప్పుబట్టారు.కొంతమంది ఖలిస్తానీలు .సిక్కులు తమకు మద్ధతుగా నిలుస్తున్నట్లుగా చెబుతున్నారని కానీ వారు కెనడాకు, సిక్కులకు అపచారం చేస్తున్నారని ఉజ్జల్ మండిపడ్డారు.ప్రస్తుతం జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీనిపై కెనడియన్ సిక్కులు, ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఎలా స్పందిస్తారో చూడాలి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube