ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.50
సూర్యాస్తమయం: సాయంత్రం.6.08
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: ద్వాదశి మంచిది కాదు.
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
మేషం:
ఈరోజు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.కుటుంబ విభేదాలు ఎదురవవచ్చు, కానీ మిత్రుల సహాయంతో పరిష్కార మార్గం లభిస్తుంది.ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఖర్చులు నియంత్రించడం అవసరం.దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
వృషభం:
ఈరోజు ఆధ్యాత్మిక సాధన, ప్రార్థనలను మీకు మానసిక శాంతిని ఇస్తాయి.పనిలో సవాళ్లు ఎదురవచ్చు.కానీ మీ కృషితో వాటిని అధిగమించగలరు.కుటుంబంలో కొన్ని అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి.కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి.
మిథునం:
ఈరోజు ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి.ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మెలకువ అవసరం.కుటుంబ సభ్యులతో మెరుగైన సంబంధాలు కొనసాగుతాయి.
ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం మంచిది.వృత్తి సంబంధిత పనుల్లో కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి.
కర్కాటకం:
ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి.వృత్తి సంబంధిత విషయాలలో పురోగతి కనిపించవచ్చు, కానీ కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
సింహం:
ఈరోజు వృత్తి, వ్యాపారాల్లో రాబడి, లాభాలు స్థిరంగా కొనసాగుతాయి.పెట్టుబడులకు తగ్గట్టుగా ఆదాయం ఆర్జించే అవకాశం ఉంది.ఉద్యోగంలో ప్రమోషన్ కు అవకాశం ఉంది.తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
కన్య:
ఈరోజు వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు బరువు బాధ్యతలు పెంచుతారు.కీలక లక్ష్యాలు అప్పగించే అవకాశం ఉంది.వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించిన లాభాలను పొందుతారు.కొందరు బంధువులు, స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది.
తుల:
ఈరోజు ఇతరుల పనుల్ని భుజాన వేసుకుని ఇబ్బంది పడతారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు అదుపు తప్పుతాయి.ఆరోగ్యం బాగానే ఉంటుంది.వృత్తి, ఉద్యోగాలు సాను కూలంగా సాగిపోతాయి కానీ, కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది.
వృశ్చికం:
ఈరోజు ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినసప్పటికీ అందుకు తగిన ప్రతిఫలం ఉంటుంది.వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు.కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను సకా లంలో పూర్తి చేస్తారు.ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి.
ధనుస్సు:
ఈరోజు ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వ్యాపారమున ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది.శరీర ఆరోగ్య సమస్యలు కొంత కలవర పెడతాయి.
వృధా ఖర్చులు చేస్తారు.విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి.
సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
మకరం:
ఈరోజు శారీరక మానసిక అనారోగ్యాలు ఉంటాయి.ఇతరుల మీద మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.అనుకొన్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తికాక ఇబ్బందికి గురవుతారు.వృత్తి ఉద్యోగాలలో అధికారులు కోపానికి గురి కావల్సి వస్తుంది.
కుంభం:
ఈరోజు ఇతరులతో వివాదాలు కలిగిన విజయం కలుగుతుంది.వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకు పొందుతారు.వ్యాపారపరంగా ఆత్మ విశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరచి మంచి ఫలితాలను సాధిస్తారు.నిరుద్యోగులు లభించిన అవకాశాలను జారవిడువకుండా చూసుకోవాలి.
మీనం:
ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది.విలువైన వస్తువులను సేకరించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.నిరుద్యోగులకు అనుకూల సమయం ఉంటుంది.