టాలీవుడ్ ఇండస్ట్రీలో సీరియళ్ల ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ నటీమణులలో రాగ మాధురి( Raga Madhuri ) కూడా ఒకరు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి మాకు ఇచ్చే పేమెంట్లలోనే క్యాస్టూమ్స్ కూడా తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
ఫంక్షన్ సీన్స్ ఉన్న సమయంలో మాత్రమే ఖర్చు తగ్గుతుందని రాగ మాధురి పేర్కొన్నారు.ట్రావెలింగ్ కు వారు ఇచ్చే మొత్తం కంటే ఎక్కువ అవుతుందని ఆమె వెల్లడించారు.
నేను మదర్ రోల్స్( Mother Rolls ) చేస్తున్నాను కాబట్టి ఈ చీరలు భవిష్యత్తులో ఉపయోగపడతాయేమో అని ఆమె తెలిపారు.మా దగ్గర ఉన్న చీరలు ఎవరికైనా ఇచ్చేయడమే అని రాగ మాధురి పేర్కొన్నారు.
షాపింగ్ కు వెళ్లినప్పుడల్లా 20000 నుంచి 50000 రూపాయలు ఖర్చు అవుతుందని ఆమె అన్నారు.నెల లేదా రెండు నెలలకు ఒకసారి షాపింగ్ కు వెళ్తామని రాగ మాధురి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

జగద్ధాత్రి సీరియల్( Jagaddhatri serial ) కోసం 400 చీరలు వాడానని రాగ మాధురి పేర్కొన్నారు.ఆ చీరలు అన్నీ వేస్ట్ అని ఆమె పేర్కొన్నారు.వేరే ఆర్టిస్ట్ లు ఆ చీరలు ఏం చేస్తారో నాకు తెలియదని రాగ మాధురి వెల్లడించారు.కన్నడ, బెంగాలీ, తమిళ వాళ్లు ఇక్కడ ఎక్కువగా వర్క్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
వాళ్ల రెమ్యునరేషన్ మాతో పోలిస్తే తక్కువని రాగ మాధురి వెల్లడించడం గమనార్హం.

వాళ్లు ఎక్కువ సమయం షూట్ లో పాల్గొంటారని ప్రొడ్యూసర్లు చెబుతారని ఆమె చెప్పుకొచ్చారు.మేము కొన్ని సీన్స్ విషయంలో రిస్ట్రిక్షన్స్ పెడతామని అంటారని మొత్తానికి మా పొట్ట కొట్టారని రాగ మాధురి వెల్లడించడం గమనార్హం.ఈ ప్రొఫెషన్ పై బ్రతకడం చాలా కష్టం అయిందని రాగ మాధురి వెల్లడించారు.
ఇక్కడ వేస్టేజ్ ఎక్కువగా కనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు.