ప్రస్తుతం వింటర్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్‌లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందరినీ జలుబు, దగ్గు వంటి సమస్యలే ప్రధానంగా వేధిస్తుంటాయి.
వీటిని నివారించుకునేందుకు ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు .అయితే ఇప్పుడు చెప్పబోయే టీని తీసుకుంటే ఇట్టే జలుబు, దగ్గు సమస్యలను వదిలించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టీ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పారిజాతం చెట్టు.దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ప్రపంచంలో ఏ చెట్టుకూ లేని ప్రాముఖ్యత, ప్రత్యేకత పారిజాతం చెట్టుకు ఉంది.ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉంటాయి.
అందుకే ఆయుర్వేద వైద్యంలో పారిజాతం ఆకులను, పువ్వులను, బెరడును విరి విరిగా ఉపయోగిస్తుంటారు.అలాగే రాత్రి పూట మాత్రమే ఈ చెట్టుకు తెల్లని పువ్వులు పూస్తుంటాయి.
ఈ పువ్వులు ఎంతో సువాసన భరితంగా ఉండటమే కాదు.అనేక అనారోగ్య సమస్యలనూ నివారిస్తాయి.
ముఖ్యంగా ఈ పుష్పాలతో టీ తయారు చేసుకుని తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు పరార్ అవుతాయి. పారిజాతం పుష్పాలతో టీ ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా ఒక గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్‌ను పోయాలి.ఇప్పుడు ఇందులో నీటిలో కడిగిన పారిజాతం పుష్పాలు ఐదు, పారిజాతం ఆకులు రెండు మరియు తులసి ఆకులు నాలుగు వేసి బాగా మరిగించాలి.
నీరు కలర్ మారేంత వరకు మరిగించి.
ఫిల్టర్ చేసుకుంటే పారిజాతం పుష్పాల టీ సిద్ధమైనట్టే.ఈ టీని రోజుకు ఒక సారి తాగితే జలుబు, దగ్గు సమస్యలు త్వరగా తగ్గు ముఖం పడతాయి.
ఆస్తమా, సైనస్ లక్షణాలు నుంచి విముక్తి లభిస్తుంది.మరియు తలనొప్పి, ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలూ దూరం అవుతాయి.