ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటైన మహా కుంభమేళా( Mahakumbh Mela ) ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరుగుతోంది.దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు, యాత్రికులు ఈ పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
ఈ మహాసంగమంలో ఎందరో సాధువులు, బాబాలు తమ విభిన్న ఆచారాలతో, ప్రకటనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.అలాంటి వారిలో బాబా అర్తత్రాణ( Baba Artatrana ) ఒకరు.
ఈ బాబా అర్తత్రాణ చేసే వింత వైద్యం ఏమిటో తెలుసా? ఆయన తన పాదాలతో( Feet ) తాకితే రోగాలు నయమవుతాయట.క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు కూడా తన పాద స్పర్శతో మాయమైపోతాయని ఈయన గట్టిగా చెబుతున్నారు.
దీంతో జనం క్యూ కట్టి మరీ బాబా పాదాల తాకిడి కోసం వేచి చూస్తున్నారు.తమ రోగాలు నయం( Heal Diseases ) అవుతాయని ఆశతో ఆయన చుట్టూ తిరుగుతున్నారు.
బాబా అర్తత్రాణ ఈ “దివ్య చికిత్స”ను 2007 నుంచి అందిస్తున్నారట.ఆయన చెప్పేది వింటే మరింత ఆశ్చర్యం వేస్తుంది.వైద్యం కోసం ఎలాంటి మందులు, ఆహారం అవసరం లేదట.కేవలం తన పాద స్పర్శ, ఫోన్ సంభాషణలు లేదా యూట్యూబ్‌లో తన మంత్రం వింటే చాలు రోగాలు మటుమాయం అంటున్నాడు.
తనను కలవలేని వారు ఫోన్‌లో మంత్రం విన్నా కూడా రోగాలు నయమవుతాయని బాబా చెబుతున్నారు.
ఇక కరోనా సమయంలో బాబా అర్తత్రాణ చేసిన ప్రకటన మరీ విచిత్రంగా ఉంది.కోవిడ్ మహమ్మారి సమయంలో లక్షలాది మందిని తన పద్ధతిలో నయం చేశానని బాబా గొప్పగా చెప్పుకుంటున్నారు.“కరోనా వచ్చినప్పుడు నేను ఒడిశా ప్రభుత్వానికే సవాల్ విసిరాను.మహమ్మారి సమయంలో లక్షల మందిని నేను నయం చేశాను,” అని బాబా స్టేట్‌మెంట్ ఇచ్చారు.
బాబా అర్తత్రాణ తన “దీవెనలు” పంచడానికి ఇతర దేశాలకు కూడా వెళ్తారట.తనకు 99% సక్సెస్ రేట్ ఉందని ఆయన గట్టిగా నమ్ముతారు.ఇది శివుడు తనకు ఇచ్చిన వరమని చెబుతారు.“శివుడి దయతో నేను ఏ రోగాన్నైనా క్షణంలో నయం చేయగలను.నాకు ఈ శక్తి ఎందుకుందో నాకు తెలియదు, కానీ నేను దానిని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగిస్తాను,” అని బాబా అన్నారు.
బాబా అర్తత్రాణ వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.కొందరు హాస్యంగా స్పందిస్తున్నారు.“ఒడియా డాక్టర్లు ఉద్యోగాలు కోల్పోవచ్చు, ఎందుకంటే భువనేశ్వర్‌లో ఇలాంటి బాబాలు చాలా మంది ఉన్నారు.” అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.ముఖ్యమైన పుణ్యస్నానాల తేదీలు ఇంకా ముందున్నాయి.