టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోలలో మొదటి స్థానంలో ఉన్నారు డార్లింగ్ ప్రభాస్.ప్రస్తుతం చేతిలో అరడజనుకు పైగా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
ఇక సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.ప్రభాస్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటారు.
కేవలం తన సినిమాలకు సంబంధించిన విషయాలను మాత్రమే పంచుకుంటూ అప్డేట్లు ఇస్తూ ఉంటారు.

సాహో విడుదలకు ముందు ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రభాస్.ప్రభాస్ కు దాదాపుగా 13 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా హీరో ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ కౌంట్ ఫై నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.అంత పెద్ద స్టార్ అయినప్పటికీ ప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటాడు.స్టార్ డమ్ గురించి అసలు ఆలోచించరు.సోషల్ మీడియా పై ఆసక్తి ఉండదు.
ప్రభాస్ పేరుతో ఉన్న ఇన్‌స్టా నుంచి వచ్చే పోస్ట్ లు షేర్ చేసేది కూడా ఆయన కాదు.ఈ మాట చెప్పి మీ అందరినీ నిరాశ పరిచినందుకు క్షమించండి.

అతడికి చిన్న చిన్న ఆనందాలంటే ఇష్టం.ఫామ్‌హౌస్ లో సంతోషంగా ఉంటాడు.ఎక్కడైనా మొబైల్ పని చేయని ప్రాంతానికి వెళ్దాం అని ఎప్పుడూ అడుగుతుంటాడు.అంత పెద్ద స్టార్ ఇలాంటి చిన్న ఆనందాలను కోరుకోవడం చూసి నేను ఒక్కోసారి ఆశ్చర్యపోతాను అని చెప్పుకొచ్చారు పృథ్వీరాజ్ సుకుమారన్.
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే పృథ్వీరాజ్ అలాగే ప్రభాస్ ఇద్దరు కలిసి సలార్( Salaar ) సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్. ఇందులో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా నటించిన విషయం తెలిసిందే.త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుంది.