చందు మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి( Sai Pallavi ) నాగచైతన్య( Naga Chaitanya ) కలిసి నటించిన చిత్రం తండేల్.( Thandel ) అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.
ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.అలాగే ఈ సినిమాలోని పాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా బుజ్జి తల్లి సాంగ్ బాగా వైరల్ అయింది.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తరికెక్కించారు అన్న విషయం తెలిసిందే.తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రియల్ తండేలు అయిన రామారావు( Ramarao ) మాట్లాడుతూ.
తండేల్ అంటే లీడర్ అని అర్థం.మిగతా జాలరులు అందరూ తండేల్ ను అనుసరిస్తారు.ఎన్ని ఎక్కువ చేపలు పడితే అంత పేరు వస్తుంది.వేటకు వెళ్లేముందు ఇదే లాస్ట్ ట్రిప్ అని నా భార్యకు చెప్పి వెళ్లాను.అప్పుడు ఆమె ఏడు నెలల గర్భంతో ఉంది.29 రోజులు సముద్రంలో వేట బాగానే సాగింది.

అయితే వెనక్కి తిరిగి రావాలని అనుంటున్నప్పుడు అనుకోకుండా పాకిస్థాన్( Pakistan ) సముద్ర జలాల్లోకి వెళ్లిపోయాము.దీంతో గుండె జారిపోయినంత పని అయ్యింది.పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ కి చిక్కి జైలుకు వెళ్లినప్పుడు బాగా ఏడ్చేశాము.దాదాపు అక్కడే 17 నెలల పాటు మగ్గిపోయాము.అయితే ధైర్యంగా పోరాడాము.కాబట్టే పాకిస్తాన్ జైలు నుంచి బయటకు వచ్చాము అని తెలిపారు రామారావు.
ఇకపోతే తండేల్ విషయానికి వస్తే.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.







