ఇటీవల రోజుల్లో ఆరోగ్యానికి మంచివని చెప్పి సోయా ఉత్పత్తులను తెగ వినియోగిస్తున్నారు.ముఖ్యంగా సోయా సాస్‌ను చాలా మంది వంటల్లో రుచి, ఫ్లేవర్ కోసం విరి విరిగా వాడేస్తుంటారు.
కానీ, సోయా సాస్ మీరు అనుకున్నంత మంచిది కాదులేండి.ఎందు కంటే, సోయా సాస్ ను వాడటం వల్ల ఆరోగ్య ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ.
అవును, తరచూ వంటల్లో సోయా సాస్‌ను వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలనే ఫేస్ చేయాల్సి ఉంటుంది.మరి అవేంటి.? ఎందుకు సోయా సాస్ ఆరోగ్యానికి మంచిది కాదు.? వంటి విషయాలను లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సోయా బీన్స్ నుంచే సోయా సాస్‌ను తయారు చేస్తారు.కానీ, ఈ తయారు చేసే క్రమంగా ఎన్నో రసాయనాలును యాడ్ చేస్తుంటారు.అందు వల్లనే సోయా సాస్‌ను అతిగా వినియోగిస్తే అనేక అనర్థాలు ఏర్పడతాయి.ముఖ్యంగా వంటల్లోనే ఓవర్‌గా సోయా సాస్‌ను యాడ్ చేసి తీసుకుంటే.వారి థైరాయిడ్ గ్రంధి తీవ్రంగా ప్రభావం అవుతుంది.దాంతో హైపర్ థైరాయిడ్ లేదా హైపో థైరాయిడ్ కి గురి కావాల్సి ఉంటుంది.
సోయా సాస్ ను అధికంగా వినియోగించే వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువట.సోయా సాస్‌లో ఉండే ఐసో ఫ్లెవనాయిడ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను చాలా వేగంగా పెంచేస్తాయి.
ఇక ఒక్కసారి క్యాన్సర్ బారిన పడ్డాక ఎన్ని బాధలను ఎదుర్కోవాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అందుకే సోయా సాస్‌ను ఎంత తక్కువ వాడితే అంత మంచిది.

అలాగే సోయా సాస్‌ను అధికంగా తీసుకోవడం వల్ల లైంగిక సమస్యలు తలెత్తే అవకాశం చాలా ఎక్కవగా ఉంటుంది.జీర్ణ వ్యవస్థ పని తీరు నెమ్మ దిస్తుంది.గుండె పోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.ఆస్తమా ఉంటే.ఆ వ్యాధి లక్షణాలు తీవ్రతరం అవుతాయి.అంతే కాదు, అతిగా సోయా సాస్‌ను వినియోగిస్తే.
అందులోని ఫైటో ఈస్ట్రోజెంట్స్ మరియు ఆక్సలేట్స్ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేలా చేస్తాయి.మరియు ఒక్కోసారి కిడ్నీ ఫెయిల్యూర్ కు సైతం కారణం అవుతాయి.
కాబట్టి, సోయా సాస్‌తో జర జాగ్రత్త.