సాధారణంగా ఒకే సినిమాలో షూటింగ్ చేసే హీరో హీరోయిన్ల మధ్య మంచి స్నేహ బంధం ఉంటుంది అన్న విషయం తెలిసిందే.కొన్ని కొన్ని సార్లు అనుకోని విధంగా హీరో హీరోయిన్ల మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తుతూ ఉంటాయి.
కానీ ఇలాంటి వివాదాలు అటు నిర్మాతలకు ఎన్నో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి.ఎందుకంటే సినిమా షూటింగ్ సాఫీగా సాగిపోతున్న సమయంలో ఇలా హీరోహీరోయిన్ల మధ్య తలెత్తిన వివాదాలు షూటింగ్ ఆగిపోవడానికి దారితీస్తూ ఉంటాయి అని చెప్పాలి.
దీంతో మళ్లీ నిర్మాతలు కలగచేసుకునే ఆ హీరో హీరోయిన్ లతో మాట్లాడి నచ్చజెప్పి సినిమా షూటింగ్ యధావిధిగా జరిగే విధంగా చేస్తూ ఉంటారు.అచ్చంగా ఇలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ ప్రొడ్యూసర్ గా గుర్తింపు సంపాదించుకున్న నట్టి కుమార్ కి ఒక అనుభవం ఎదురైందట.
తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు సంపాదించుకున్న రాజశేఖర్ అందాల ముద్దుగుమ్మ కమలినీ ముఖర్జీ కాంబినేషన్ ఒక సినిమా తెరకెక్కింది.సినిమా షూటింగ్ సమయంలో 35 రోజుల పాటు షూటింగ్ చేశారు.
ఇక హీరో రాజశేఖర్ తన కుటుంబ సభ్యులతో స్విజర్లాండ్ వెళ్లగా.ప్రొడ్యూసర్ నట్టికుమార్ కూడా తన భార్యా పిల్లలతో స్విజర్లాండ్ వెళ్లారట.
ఇక అంతా షూటింగ్ మొత్తం సవ్యంగా సాగి పోయింది ఇక చివరి రోజు కూడా షూటింగ్ అంతా సరిగ్గా జరిగింది.చివరికి ఇంకో గంట ఉంది అనుకుంటున్న సమయంలో చివరికి హీరోయిన్ కమలినీ ముఖర్జీ షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయారట.
నేరుగా ఎయిర్పోర్టుకు వెళ్లి ఇక అక్కడినుంచి ఇండియా వచ్చేసారట కమలినీ ముఖర్జీ.
మరో గంట సేపట్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకుంటున్న సమయంలో ఇలా హీరోయిన్ కమలినీ ముఖర్జీ ఎందుకు అలిగి వెళ్ళిపోయింది అన్నది మాత్రం ప్రొడ్యూసర్ నట్టి కుమార్ కి కూడా అర్థం కాలేదట.అయితే హీరో రాజశేఖర్ హీరోయిన్ కమలినీ ముఖర్జీ మధ్య ఏదో వివాదం తలెత్తింది అన్న విషయం తర్వాత పరిస్థితులను బట్టి అర్థం చేసుకున్నారు.హీరో హీరోయిన్ల మధ్య ఏం వివాదం తలెత్తింది అన్నది మాత్రం ఇప్పటికి నట్టి కుమార్ కు తెలియదట.
ఇటీవల ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు నట్టి కుమార్ .