చిరంజీవికి పీడకలగా మారిన 1994 ..మళ్ళి నిలబెట్టిన సినిమా ఏంటో తెలుసా.. ?

మెగాస్టార్ చిరంజీవి.తెలుగు ప్రజలతో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీకి ఈ పేరు ఎంతో పరిచయం ఉంది.

 Unknown Facts About Chiranjeevi Career, Chirenjeevi, Hitler, Mugguru Monagallu,-TeluguStop.com

ఆయన ఇప్పటి వరకు 150కి పైగా సినిమాలు చేసి తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటికీ టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.ఎప్పటికప్పుడు తన గ్రేస్ పెంచుకుంటూ కుర్రహీరోలను మించిన నటన కనబరుస్తున్నారు.

డ్యాన్సులో ఇప్పటికీ ఆయనను కొట్టే నటుడే లేడని చెప్పుకోవచ్చు.అలాంటి చిరంజీవి.

ఒకానొక సమయంలో వరుస పరాజయాలు చవి చూశారు.అదే సమయంలో తిరిగి తన సత్తాను చాటేలా చేసింది ఓ సినిమా.

ఇంతకీ ఆసినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పిన ఆ సినిమా మరేదో కాదు.

హిట్ల‌ర్.హ్యాట్రిక్ పరాజయాలతో సతమతం అవుతున్న చిరంజీవిని మళ్లీ గాడిలో పెట్టిన సినిమా ఇది.1994లో చిరంజీవి నటించి పలు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ముగ్గురు మొన‌గాళ్లు, బిగ్ బాస్, రిక్షావోడు, ఆప‌ద్భాంద‌వుడు లాంటి సినిమాలు ఆయన కెరీర్ మీద దెబ్బ మీద దెబ్బ కొట్టాయి.

ఆ సినిమాల తర్వాత చిరంజీవి ఏడాది పాటు గ్యాప్ తీసుకున్నాడు.అదే సమయంలో మలయాళంలో మమ్ముట్టి హీరోగా వచ్చిన హిట్లర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

అదే సినిమాను రీమేక్ చేయాలి అనుకున్నాడు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య.కథతో తెలుగు ప్రజలకు కనెక్ట్ అయ్యేలా మార్పులు చేశాడు.చిరంజీవి హీరోగా ఈ సినిమా తెరకెక్కించాడు.

Telugu Apdbandavudu, Bigboss, Chiranjeevi, Hitler, Rikshavodu-Telugu Stop Exclus

అనుకున్నట్లుగానే షూటింగ్ పూర్తి చేసుకుని హిట్లర్ సినిమా తెగునాట రిలీజ్ అయ్యింది.మంచి కంటెంట్ తో పాటు కావాల్సినంత సెంటిమెంట్ ఉండటంతో తెలుగు జనాలు ఈజీగా కనెక్ట్ అయ్యారు.వరుస పరాజయాల్లో ఉన్న చిరంజీవికి ఓ రేంజిలో బూస్టింగ్ ఇచ్చింది.అంతకు ముందు ఎన్నో రికార్డులు సాధించిన చిరంజీవి ఘరానా మొగుడు సినిమా రికార్డులను .10 ఏండ్ల తర్వాత వచ్చిన హిట్లర్ సినిమా తిరగరాసింది.అప్పట్లోనే 42 సెంటర్లలో హిట్లర్ సినిమా రోజుకు 4 షోల చొప్పున 100 రోజులు ఆడి సంచనలం సాధించింది.చిరంజీవి కెరీర్ ను ఓ మలుపు తిప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube