అజిత్, షాలిని.ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరో, హీరోయన్లు.
ప్రస్తుతం సంసార జీవితాన్ని హాయిగా కొనసాగిస్తున్నారు.ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నారు.
అజిత్ సినిమాల్లో టాప్ హీరోగా రాణిస్తున్నా. షాలిని మాత్రం సినిమాలకు కాస్త దూరంగానే ఉంటుంది.
అయితే వీరిద్ది ప్రేమ చాలా విచిత్రంగా మొదలైయ్యింది.చివరకు పెళ్లి వరకు వెళ్లింది.
ఇంతకీ వీరి లవ్ కు బీజం ఎలా పడింతో ఇప్పుడు తెలుసుకుందాం.
అజిత్, షాలిని ప్రధాన పాత్రల్లో 1999లో అమర్కలమ్ అనే సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాలో హీరో, హీరోయిన్ చేతిని చాకుతో గాయం చేసే సీన్ ఉంటుంది.ఈ సీన్ లో అజిత్ జస్ట్ ఆమె చేతిని కోస్తున్నట్లు యాక్ట్ చేయాలి.
కానీ పొరపాటున తన మణికట్టును నిజంగానే కోస్తాడు.దీంతో రక్తం వస్తుంది.
ఈ ఘటనతో అజిత్ చాలా టెన్షన్ పడ్డాడు.కానీ షాలిని మామూలుగానే తీసుకుంది.
తన కోసం అజిత్ పడిన టెన్షన్ ఆమెకు చాలా నచ్చింది.అప్పటి నుంచి అజిత్ తో షాలిని చాలా దగ్గరగా మెలిగింది.ఆ గాయం ఇద్దరిలో ప్రేమను నింపింది.
మొత్తంగా ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే తన జీవిత భాగస్వామి షాలిని అని అజిత్ ఫిక్స్ అయ్యాడు.ఇదే విషయాన్ని షాలినికి చెప్పాడు.షాలినికి కూడా తనంటే ఇష్టం కాబట్టి నో చెప్పలేదు.
షాలిని అప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే వరకు వీరి పెళ్లిని వాయిదా వేశారు.పెళ్లి తర్వాత షాలిని సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకుంది.
అయితే నటనను వదిలి వేయడం పట్ల తాను ఎప్పుడూ బాధ పడలేదని చెప్పింది.అంతేకాదు.
మీరిద్దరిని స్ర్కీన్ మీద చూడ్డం మిస్ అవుతున్నాం అని ఎవరైనా తనతో అంటే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పింది.అయితే కటుంబంతో సంతోషంగా ఉండటమే తనకు ఇంకా నచ్చుతుందని వెల్లడించింది.
ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు.వారి పేరు అనౌష్క, ఆధిక్.