ఆర్తి అగర్వాల్.ఈ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.
ఎందుకంటే ఎన్నో సినిమాల్లో నటించి తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా హవా నడిపింపించింది.
ఎంతోమంది కుర్రకారు మతి పోగొట్టి వరుస అవకాశాలతో బిజీబిజీగా గడిపింది.కానీ ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా చిత్రపరిశ్రమకు దూరమైపోయింది.
ఆ తర్వాత కాలంలో హఠాత్ మరణం చెంది అభిమానులు దిగ్భ్రాంతికి గురి చేసింది.
అయితే ఆర్తి అగర్వాల్ వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అయింది అన్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ముందు హిందీలో పాగల్ బన్ అనే ఒక సినిమాలో మాత్రమే నటించింది.ఆ తర్వాత న్యూ ఇయర్ కి వెళ్ళిపోయింది.
అయితే నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో అవకాశం రావడానికి పెద్ద స్టోరీనే ఉందట.త్రివిక్రమ్ నిర్మాతలకు స్టోరీ వినిపించగా వాళ్లు ఫిదా అయ్యారు.
దీంతో ప్రొడ్యూసర్ స్రవంతి రవికిషోర్ వెంటనే త్రివిక్రమ్ అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు.

అంతలోనే హీరో హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది.వెంకటేష్ కి కథ చెప్పగానే ఒప్పుకున్నాడు.అయితే హీరోయిన్ గా ముందుగా త్రిష ని అనుకున్నారు.
త్రిష ఎందుకో సినిమా కథ విని ఒప్పుకోలేదు.దీంతో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించారు.
అదే సమయంలో దర్శకుడు విజయభాస్కర్ ముంబై వెళ్లి హీరోయిన్ వెతకడం ప్రారంభించారు.ఈ క్రమంలోనే మోడల్స్ ఫోటోలు చూస్తుండగా ఆర్తి అగర్వాల్ ఫోటో ఆయన కంటపడింది.
ఇక ఆమె గురించి ఆరా తీస్తే ఒక సినిమా చేసి న్యూయార్క్కు వెళ్లిపోయిందని ఎక్కడ ఉందో ఏం చేస్తుందో తెలియదు అని చెప్పారు.దీంతో ఆమెను పట్టుకోవడం మరింత కష్టమైంది.
వెంటనే హైదరాబాద్ తిరిగివచ్చి సురేష్బాబు దగ్గరికి వెళ్లి ఆయనకు న్యూయార్క్లో ఉన్న ఫ్రెండ్ సహాయంతో ఇక ఆర్తి అగర్వాల్ ను పట్టుకున్నారు.అక్కడికి వెళ్లి స్క్రిప్ట్ వినిపించి.
అడ్వాన్స్ ఇచ్చి నేరుగా షూటింగ్ స్పాట్ కే ఆమెను పిలిపించారట.ఇలా ఆర్తి అగర్వాల్ కి మొదటి ఛాన్స్ రావడం వెనుక ఇంత పెద్ద స్టోరీ నచ్చిందట.