సహజంగానే కంటి చూపును మెరుగుపరిచే ఆయుర్వేద చిట్కాలు ఇవే..!

కళ్ళను( eyes ) ఆరోగ్యంగా ఉంచడం దాదాపు భూమి మీద ఉన్న జీవరాశులందరికీ ఎంతో ముఖ్యం.ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ పరికరాల( Electronic devices ) వాడకం పెరిగిపోయింది.

 These Are The Ayurvedic Tips That Naturally Improve Eye Sight ,ayurvedic Tips ,-TeluguStop.com

ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, టీవీలో చూడడం వల్ల స్కిన్ టైం పెరిగి కంటి పై భారం పడుతుంది.అదనంగా నిద్రలేమి సమస్యలతో పరిస్థితి మరింత తీవ్రంగా దిగజారిపోయింది.

మరోవైపు వాతావరణ కాలుష్యం, అనారోగ్యకరమైన జీవన శైలి, చూపుకోల్పోయే ప్రమాదాన్ని పెంచుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.రోజురోజుకీ దృష్టి లోపాలను ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.చిన్న వయసు గల పిల్లలు కూడా కళ్ళకు కళ్ళజోడు( Spectacles ) ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.సరైన కంటి సంరక్షణ లేకపోవడం పోషక ఆహారం తీసుకోవడం వల్ల కూడా డయాబెటిక్ రెటినోపతి, కార్నియల్ మచ్చలు, కంటి శుక్ల, పొడి కళ్ళు, కంటి అలెర్జీలు, మెల్లకన్ను వంటి సమస్యలు ఏర్పడవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Telugu Ayurvedic Tips, Electronic, Eye, Eyes, Tips, Improve Eye, Smart Phone, Sp

అందువల్ల కళ్ళను ఆరోగ్యంగా చూసుకుంటూ కంటి చూపును మెరుగుపరచుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.కంటి చూపును మెరుగుపరచుకోవడం కోసం ఉపయోగించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.త్రాటకం అనేది ఒక కొవ్వొత్తి వెలుగును లేదా ఏదైనా చిత్రాన్ని లేదా ఏదైనా నిశ్చల వస్తువులను చూస్తూ ఉండడం.ఇది ధ్యానంలోని ఒక భాగం.

Telugu Ayurvedic Tips, Electronic, Eye, Eyes, Tips, Improve Eye, Smart Phone, Sp

ఈ కార్యాచరణ ద్వారా దుష్ఠి ఏకాగ్రతను మెరుగుపరచుకోవచ్చు.నేత్రదౌతి కంటినీ శుభ్రపరిచే చికిత్స.శుభ్రమైన నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి.ఇది కళ్ళ నుంచి చెత్తను దూరం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.అంతేకాకుండా కంటి చూపును మెరుగుపడుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే కళ్ళ ఆరోగ్యంతో పాటు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోడానికి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.

ఆయుర్వేద మూలిక త్రిఫల వివిధ రకాల కంటి రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.దీన్ని నీటిలో కరిగించి ఐ వాష్ గా ఉపయోగించవచ్చు.

ఇది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు కళ్ల పై భారాన్ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube