మామిడి తోరణాలు కట్టడం ఎప్పటినుంచి ఆచారంగా ఉందో తెలుసా?

మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు, కొన్ని మొక్కలను సైతం దైవ సమానంగా భావిస్తారు.

అలాంటి దేవత వృక్షాలకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ, వాటికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉంటారు.

ఇందులో భాగంగానే మామిడి చెట్టు ను కూడా దైవ సమానంగా భావిస్తారు.మామిడి చెట్టును దైవ సమానంగా భావించడం వల్ల మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, పండుగలు జరిగిన మొదటగా గుమ్మానికి మామిడి తోరణాలు వేలాడదీస్తారు.

ఈ ఆకులతో తోరణాలు కట్టడం వల్ల ఆ ఇంటికి పండుగ శోభ కలుగుతుంది.అయితే ఈ మామిడి తోరణాలను కట్టడం ఎప్పటినుంచి ఆచారంగా ఉందో ఇక్కడ తెలుసుకుందాం మామిడి ఆకులను మన జీవితంలో ప్రేమకు, సంపదకు, సంతానాభివృద్ధికి ప్రతీకగా, ఈ మూడింటిని అందించే మొక్కగా మామిడి చెట్టును పూజిస్తారు.

మామిడి చెట్టు గురించి రామాయణం, మహాభారతం వంటి పురాణ గ్రంథాలలో సైతం ఈ మామిడి మొక్కల ప్రస్తావన ఉంది.ఈ మామిడి ఆకులు లేకుండా ఎటువంటి కార్యక్రమాలు జరగవు.ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న మామిడి తోరణాలను క్రీ.శ150 కాలం నాటి సాంచి స్తూపం మీద ఈ మామిడి తోరణాలను, మామిడి పండ్లను ఎంతో అద్భుతంగా చెక్కినట్లు ఆధారాలున్నాయి.దీన్ని బట్టి చూస్తే మామిడి తోరణాలు క్రీ.

Advertisement

శ 150 కాలం నుంచి వాడుకలో ఉన్నట్లు తెలుస్తోంది.మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు పూర్ణకుంభం ఏర్పాటు చేస్తాము.

ఈ పూర్ణకుంభాలను సాక్షాత్తు ఆ భూదేవి రూపంగా భావిస్తారు.ఈ పూర్ణకుంభంలో మామిడి ఆకులు, కొబ్బరికాయ, నీటిని వాడుతారు.

అంతే కాకుండా భగవంతుని పూజించడానికి సైతం ఈ మామిడి ఆకులను ఉపయోగిస్తారు.ఈ విధంగా మన సాంప్రదాయాలలో మామిడి మొక్కకు ప్రత్యేక స్థానం కల్పించారు.

ఈ మామిడి వృక్షాన్ని కల్పవృక్షం అని కూడా పిలుస్తారు.అంతేకాకుండా మామిడి పువ్వును మన్మధుని బాణాలు లో ఒకటిగా కాళిదాసు కవితలలో ఎంతో అద్భుతంగా వర్ణించారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు