నల్లేరులో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

నల్లేరును సంస్కృతంలో వజ్రవల్లీ, చతుర్థార, అస్థి సంధాన అని పిలుస్తారు.ప్రాచీన గ్రంధం భవప్రకాశ’ లో విరిగిన ఎముకలు అతుక్కోవటానికి నల్లేరు బాగా సహాయపడుతుందని తెలిపారు.

 Nalleru Health Benefits-TeluguStop.com

నల్లేరు గురించి పట్నవాసులకు తెలియదు కానీ పల్లెటూరు వాసులకు బాగా తెలుసు.నల్లేరు పల్లెటూర్లలో పొలాల్లో,రోడ్డు పక్కన డొంకల్లో ఉంటుంది.

నల్లేరు తీగలాగా ఉంటుంది.సాధారణంగా 1.5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.దీని కాండం చతురస్రాకారంలో ఉండి 8-10 సెంటీమీటర్ల దగ్గర ‘గణుపు’ వుంటుంది.

ఆ గణుపు దగ్గర వేరు మరియు ఆకులు వస్తాయి.నల్లేరులో కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సి, కాల్షియమ్ ఆక్సలేటర్, సెలీనియమ్, క్రోమియం, విటమిన్ బి సమృద్ధిగా ఉంటాయి.

నల్లేరు ఎముకలలో దృఢత్వం పెంచటమే కాకుండా ప్రక్కన వుండే కండరాలకు శక్తిని కలిగిస్తుంది.ఇదికాక దీనిలో నొప్పి నివారణ గుణాలు అధికంగా ఉన్నాయి.

ఆస్ప్రిన్ మాత్రకి సమానంగా నివారణ గుణాలు ఉంటాయి.

నల్లేరు రసంను సిద్ద వైద్యంలో వాడతారు.నల్లేరు లో యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలముగా ఉన్నాయి.నల్లేరు రసం రక్తహీనత లేకుండా కాపాడుతుంది .నల్లేరు తీగ లోని లేత కణుపులు కోసి వాటి తొక్క తీసి పచ్చడి,పప్పు,కూర వంటివి చేసుకుంటారు.అయితే నల్లేరును కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే దురద రాదు.

మహిళలలో 40 వయసు తర్వాత వచ్చే మెనోపాజ్ లక్షణాలలో ఎముకల బలహీనత చాలా ముఖ్యమైనది.నల్లేరు లో అధికముగా ఉండే కాల్షియం వలన అటువంటి ఇబ్బందులు తగ్గుతాయి .ఆస్థియో పోరోసిస్ ,ఎముకలు గుల్ల బారడం చిన్న దెబ్బలకు ఎముకలు విరగడం వంటివి రాకుండా నల్లేరు ఎంతగానో ఉపయోగపడుతుంది.నల్లేరులో పీచు అధికంగా ఉండటం వలన పైల్స్ సమస్యను తగ్గిస్తుంది.

యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండుట వలన గ్యాస్ట్రిక్ అల్సర్ లను నిరోధిస్తుంది.ఆయుర్వేదం వైద్యంలో నల్లేరును ఎక్కువగా వాడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube