సాధారణంగా కొందరిని మొటిమలు( Acne ) చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.ముఖం మొత్తం మొటిమలు ఏర్పడి అందాన్ని పాడుచేస్తాయి.
అద్దంలో ఫేస్ చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడేలా చేస్తాయి.మీరు కూడా మొటిమలతో బాధపడుతున్నారా.? రకరకాల క్రీములను వాడి విసిగిపోయారా.? డోంట్ వర్రీ.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీతో మొటిమలకు కంప్లీట్ గా గుడ్ బై చెప్పవచ్చు.
అందుకోసం ముందుగా ఒక కప్పు ఆరెంజ్ తొక్కలు,( Orange Peel ) ఒక కప్పు నిమ్మ తొక్కలు( Lemon Peel ) మరియు ఒక కప్పు వేపాకును( Neem Leaves ) బాగా ఎండబెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండబెట్టుకున్న ఆరెంజ్, లెమన్ తొక్కలతో పాటు వేపాకు కూడా వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసి పెట్టుకున్న ఆరెంజ్ లెమన్ నీమ్ పౌడర్ వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ చందనం పొడి, వన్ టీ స్పూన్ తేనె మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే అనేక బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ప్రధానంగా ఈ రెమెడీ మొటిమల బెడదను తగ్గిస్తుంది.చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తిని తగ్గించి మొటిమల్లేని మెరిసే చర్మాన్ని మీ సొంతం చేస్తుంది.మొటిమలతో బాధపడుతున్న వారికి ఈ రెమెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది.
అంతేకాకుండా స్పిన్ కలర్ ను ఇంప్రూవ్ చేయడంలో, చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలను తొలగించడంలో ఈ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.చర్మాన్ని ఆరోగ్యవంతంగా ప్రకాశవంతంగా మారుస్తుంది.