తమిళ్ సినిమా ఇండస్ట్రీలో( Tamil film industry ) స్టార్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు సూర్య( Actor Surya )… ప్రస్తుతం ఈ హీరో పాన్ ఇండియాలో సినిమాలు చేసినప్పటికి ఆయనకు ఏ మాత్రం కలిసి రావడం లేదు.వరుసగా అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి సినిమా చేయాలి అని ధోరణిలో ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనుకున్న ప్రతిసారి ఆయనకు నిరాశనే మిగులుస్తుంది.

కాబట్టి ఇప్పుడు తెలుగు దర్శకులతో ఆయన సినిమాలు చేయాలనే ఆసక్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పటికే ఆయనకు వెంకీ అట్లూరి ( Venky Atluri )లాంటి యంగ్ డైరెక్టర్ ఒక కథను కూడా వినిపించినట్టుగా తెలుస్తుంది.ఇక ఆ కథకి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక అతనితో పాటుగా మరొక యంగ్ డైరెక్టర్ అయిన చందు మొండేటి ( Chandu mondeti )దర్శకత్వంలో కూడా సూర్య ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట.
వీళ్ళ కాంబోలో ఇంతకుముందే సినిమా రావాల్సింది.

కానీ చందు మొండేటి సినిమాలతో కొంచెం బిజీగా ఉండడం వల్ల సూర్యతో సినిమా చేయడానికి అతనికి చాలా సమయం అయితే పట్టిందనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా చందు మొండేటి చేస్తున్న తండేల్ సినిమా సూపర్ సక్సెస్ అయితే అతనికి సూర్యతో చేయబోయే సినిమా మీద భారీ అంచనాలైతే ఉంటాయి.అలా కాకుండా ఈ సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా కూడా ఈ ప్రాజెక్టు మీద కొంతవరకు అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది.
మరి ఏది ఏమైనా కూడా ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సూర్య సినిమాలు చేస్తూ ఉండటం విశేషం…చూడాలి మరి ఇక మీదట ఈయన ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది…
.